బెల్లమే మేలు( బాల గేయము)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.
చెరుకు రసము తీసారు
ఉడికించి బెల్లం చేశారు
తేమ తక్కువగా ఉంచారు
పోషకాల కే నిధుల అన్నారు 

చక్కెర కన్నా బెల్లం మేలు
ఆరోగ్యాలను కూర్చేను
రసాయనాలకుప్పే చెక్కర
సహజసిద్ధమే బెల్లమురా

రోజు బెల్లము వాడండి
కృతిమ త్వాన్ని మానండి
టీలో బెల్లం వేయండి
బెల్లపు స్వీట్లు తినరండి.