అల్లము (బాలగేయం)పెందోట వెంకటేశ్వర్లు, సిద్దిపేట.

అల్లమండి అల్లము
 దివ్యమైన ఔషధం 

ప్రతి వంటల్లో అల్లము 
మంచి రుచినే పెంచును
సంవత్సరమంతా లభించును 
ఆరోగ్య పుష్టినిచ్చును

శరీర బాధల పోగొట్టును
నొప్పులనే తుడి చేయును
ఆరోగ్యమే మహాభాగ్యం అని 
అల్లమే రుజువు చేయును 

దగ్గు జలుబు లున్నను 
అల్లము రసము తాగుము
నిత్యం ఇంత తిను చున్న 
ఆరోగ్యమే మనకు వచ్చు
కామెంట్‌లు