చీకటికి స్పందించే కళ్ళు !?:-ప్రతాప్ కౌటిళ్యా ( కె ప్రతాప్ రెడ్డి)MSc Bio-chem-Mtech Bio-Tech

 ఈ సృష్టిలో నిమ్నజీవుల నుంచి ఉన్నత జీవుల వరకు కన్ను ఒక ప్రధాన పరిణామక్రమ ఆయుధము అవయవం. జీవుల్లో కళ్ళు ఏర్పడడం ఒక అద్భుత పరిణామక్రమ ఆవిష్కరణ. ఆ తర్వాతనే జీవులలో మెదడు పనిచేసే పనితీరులో చాలా మార్పు చోటు చేసుకుంది. జీవులలో లో ఇంటెలిజెన్స్ ఏర్పడటానికి కన్ను ఒక ప్రధాన జ్ఞానేంద్రియం.
జీవులలో ఆహారంకోసం గేటు లో భాగంగా కూడా కన్ను ఒక అద్భుత పరిణామం చెందింది. జీవులలో జ్ఞానేంద్రియాల లో భాగంగా కన్ను మెదడును దాదాపుగా డామినేట్ చేసింది. అంటే జీవి తన పరిసరాలు వేరే జీవుల నుంచి రక్షించుకునే ఈ క్రమంలో మరియు ఆహార సముపార్జనలో భాగంగా అన్నింటి సమాచారాన్ని మొత్తాన్ని కేవలం కన్ను మాత్రమే మే మెదడుకు అందించింది. అందుకే కన్ను దాదాపు గా మెదడు మొత్తాన్ని సమాచారంతో నింపేసి ఆక్రమించుకుంది. అందుకే జీవులు ముఖ్యంగా కన్ను ను జీవ పరిణామ క్రమంలో ప్రధానంగా మెదడు మెదడు పనితీరును మెరుగుపరుస్తు ఒక జ్ఞానేంద్రియం గా మారింది. అయితే కన్ను పనితీరు యంత్రాంగం అంతా కూడా కాంతి మీద ఆధారపడి ఉంది.
సూర్యకాంతి కి అనుకూలంగా కన్ను ఈ పరిణామం జరిగి ప్రకృతి అనుకూలతలో భాగంగా ప్రధాన జ్ఞానేంద్రియం గా మారింది. భూమి మీద కాంతి కి అనుకూలంగా కన్ను నిర్మాణం యంత్రాంగం ఆధారపడి పని చేయడం జరిగింది. కన్ను కేవలం కాంతికి మాత్రమే స్పందిస్తుంది. అంతేగాని చీకటికి స్పందించదు. చాలా సార్లు ముఖ్యంగా మనం మరియు కొన్ని జీవులు చీకటి కి అనుకూలంగా కూడా కన్ను నిర్మాణం పనితీరు యంత్రాంగం ఉంటుందని అనుకుంటాం కానీ అది నిజం కాదు అది ఒక అపోహ మాత్రమే.
ఈ భూమ్మీద అ జీవులన్నీ కేవలం కన్ను ద్వారానే తమ జీవన విధానం ప్రత్యుత్పత్తి ఆహార సముపార్జన మొదలగు అన్ని ప్రక్రియలు కేవలం కన్ను కు అనుకూలంగా జరగడం వలన జీవనశైలి మాత్రమే కాకుండా జీవులలోని అన్ని జీవశాస్త్ర గడియారాలు ఏర్పడ్డాయి. ఎందుకంటే కాం తి కి అనుకూలంగా నే కన్ను పని చేయడం వలన జీవి అవయవాలు జీవ రసాయన చర్యలు అన్నీ కూడా జీవశాస్త్ర గడియారాలు వాటికి అనుకూలంగానే ఏర్పడి కొనసాగుతున్నాయని గుర్తించాలి. కన్ను కేవలం కాంతికి మాత్రమే స్పందిస్తుంది తప్ప చీకటికి స్పందించదు కన్ను నిర్మాణం అలా జరిగింది .
అంతేగాని చీకటికి కన్ను స్పందించి జీవశాస్త్ర గడియారాలకు అది కారణం కాలేదు. కేవలం కాంతి కోసం మాత్రమే కన్ను సమాచారం అందించడానికి ఏర్పడ్డ ఒక అవయవం. జీవులలో జీవరసాయన చర్యలకు జీవులలోని అవయవాలకు జీవశాస్త్ర గడియారాలు ఏర్పడడంలో కన్ను కాంతికి స్పందించడం వలన నే ఏర్పడ్డాయని గుర్తించాలి.
చీకటి కి కన్ను స్పందించదు చీకటి స్పందించాలి అంటే కన్ను నిర్మాణం మరోరకంగా జరగాలి. అలా కొన్ని జీవులలో జరిగింది. కానీ అవి కూడా తక్కువ కాంతిలో కూడా చూడడం కోసం మాత్రమే జరిగింది. అంటే చివరికి కాంతి మాత్రమే స్పందించే కళ్ళు ఉన్నాయి కానీ చీకటికి స్పందించే కళ్ళు లేవు.
జీవులలో జీవరసాయన అవయవాల జీవశాస్త్ర గడియారాలు ఏర్పడడానికి అలాంటి కళ్ళు ఏర్పడలేదు. చీకటికి స్పందించే కళ్ళు ఉంటే ఎంత బాగుండును. చీకటిని జయించేవాళ్ళం. చీకటి కి అనుకూలంగా జీవించే వాళ్లం .అద్భుతాలు జరిగి ఉండేవి.
Pratapkoutilya
Lecturer in Bio-Chem
8309529273
.