రిహాన్ "ఆవర్తన పట్టిక అంశాలు" - (Periodic Table Elements) :మొలక


 మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం పెద్ద వాళ్లకు అర్థం కాకున్నా చిన్నపిల్లలు అందులో నిష్ణాతులవుతున్నారు. ఎలా అంటే అతి చిన్న వయసులో ఎన్నెన్నో ప్రయోగాలు చేసి పెద్దలను అబ్బుర పరుస్తున్నారు. ఇక్కడ ఒక తమ్ముడి ని మీకు పరిచయం చేస్తున్నాం పేరు  రిహాన్ (రిహు) బజ్జూరి - 3 సంవత్సరాల, USA అట్లాంటా లో ఉంటున్నాడు , అమ్మ పేరు - సహజా, నాన్న  పేరు - సందీప్, అన్నా పెరూ - రేయాన్ష్.
రిహాన్  చిన్నప్పుడే ఏం చేసాడో సేలుసుకుందాం 
"ఆవర్తన పట్టిక"  (Periodic Table Elements) అంటే  రసాయన మూలకాలను వాటి పరమాణు సంఖ్యలు, ఎలక్ట్రాన్ విన్యాసముల ఆవర్తన రసాయన ధర్మముల ఆధారంగా యేర్పాటు చేరిన ఒక అమరిక.
రిహాన్ 2 సంవత్సరాలు 10 నెలలు ఉన్నప్పటి నుంచే  ఆవర్తన పట్టిక అంశాలను చెబుతున్నాడు అంటే మనం చిహ్నం చెబితే అతను మూలకాన్ని చెబుతాడు అంతే కాదు దాని వివరాలు చెబుతాడు. ఆవర్తన పట్టిక అంశాలు సాధారణంగా పిల్లలు ఇంటర్మీడియట్‌లో పూర్తిగా నేర్చుకుంటారు. రిహాన్ సుమారు 16 నెలల ఉన్నప్పుడు నుండి విభిన్న విషయాలను నేర్చుకోవడంలో  వాటిని గుర్తుంచుకోవడంలో ఆసక్తి చూపించడం ప్రారంభించాడు, మనమ్ రెండు లేదా మూడుసార్లు చెబితే అతను వాటిని గుర్తుంచుకుంటాడు. అలా రెండు లేదా మూడుసార్లు ఆవర్తన పట్టిక అంశాలను విని వాటిని గుర్తుంచుకున్నాడు. రిహు 2 సంవత్సరాల 6 నెలల వయస్సులో ఉన్నప్పుడు ఆంగ్ల వర్ణమాలలు  సంఖ్యలను ఎలా రాయాలో స్వయంగా నేర్చుకున్నాడు. మీకు సాక్ష్యం కావాలా అయితే ఈ వీడియో చూడండి . 
కామెంట్‌లు