1*
తొమ్మిది నెలలు మోసి
ప్రేమ కబుర్లు చెప్పి పొత్తిళ్లలో
అభిమన్యునివోలె తీర్చిదిద్దు
అమ్మప్రేమ అమృతమయము
2.
పురుడు పోసుకొని తాను
పునర్జన్మనే ఎత్తు మనకోసం
కలల పంటయని మురిసిపోవు
అమ్మప్రేమ అమృత మయము
3.
మలమూత్రాదులతో నున్న
మనల శుభ్రపరచు సహనమున
విసుగు లేకతాను ఊడిగమొనర్చు
అమ్మప్రేమ అమృతమయము
4.
తాను పస్తులుండి బిడ్డకొరకు
దాచిపెట్టి కడుపు నింపు మాత
అమ్మప్రేమ అమృతమయము
5.
చిన్నికృష్ణుని వోలే
చిలిపి చేష్టలు చూసి
మురిసిపోవు అమ్మ
అమ్మప్రేమ అమృతమయము
6.
త్యాగానికి గుర్తు అమ్మ
మానవతకు మారురూపు అమ్మ
కల్మషము లేని సౌజన్యమూర్తి
అమ్మప్రేమ అమృతమయము
7.
తప్పటడుగులతో తడబడి
క్రింద పడిపోతే తాను ఆసరై
వేలుపట్టి నడిపించు అమ్మ
అమ్మప్రేమ అమృతమయము
8.
ఆది గురువుయై అన్ని బోధించు
నీతి నియమాలు బోధించు
సద్గుణాలతో తీర్చిదిద్దు
అమ్మప్రేమ అమృతమయము
9.
బాలనేస్తాలతో ఆడుతూ
దుమ్ము దూళితూ దేహమంత
నింపుకొన్న అమ్మ మందలించు
అమ్మప్రేమ అమృతమయము
10.
తానంతటా ఉండలేకనేమో
అమ్మను సృష్టించి ఇలకు పంపే
అమ్మను నమ్మి దైవము నన్ను
అమ్మప్రేమ అమృతమయము

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి