01.
తే.గీ.
చక్కనితెలుగుభాషలో మిక్కిలిగను
ఖండకావ్యాలురచియించిమెండుగాను
కరుణరసమునుచొప్పించికవిగవెలిగి
సాహితీసేవ"జంధ్యాల"సలిపినాడు!!!
02.
తే.గీ.
"తెలుగుబాలశతకము"నుతేటగాను
ద్రాక్షపాకమువలెవ్రాసి ధన్యుడయ్యి
తెలుగుభాషామతల్లికితిలకమద్ది
సాహితీసేవ"జంధ్యాల"సలిపినాడు!!!
03.
తే.గీ.
పూని "పుష్పవిలాపము"పొందుగాను
కావ్యమల్లియుఘనకీర్తికమ్రమొప్ప
అందుకొనిసదా"కరుణశ్రీ" నందనముగ
సాహితీసేవ"జంధ్యాల"సలిపినాడు!!!
04.
తే.గీ.
అలతియలతిపదాలతోసులువుగాను
మధురకవితలువెలయించిమధువులొలుక
పద్యవిభవముచాటించిప్రతిదినంబు
సాహితీసేవ"జంధ్యాల"సలిపినాడు!!!
05.
తే.గీ.
"పరమకరుణాసమేతమాభరతమాత"
యనుచువేనోళ్లకీర్తించివినయముగను
కలముకదిలించికొనసాగిసలలితముగ
సాహితీసేవ"జంధ్యాల"సలిపినాడు!!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి