ఆర్థిక బంధాలు పెరిగిన వేళ
అనుబంధాలకు పాతరేస్తున్న వేళ
ధనసంపాదనకన్న స్నేహమే మిన్నగా
భాషలేని భావాలను పంచుతూ
ఆనందతీరాలను ముద్దాడేది స్నేహం
అగాథo లాంటి గుండె లోతుల్లోనున్న
కనబడని బడబాగ్నిల్లాంటి బాధలను
మనసు పొరలలోని నిక్షిప్త గాయాలను
స్నేహమనే తాయిలంతో స్పృశిస్తూ
మధురమైన వాక్కులతో మాన్పుతూ
చెరగని బంధమై చేయూతనివ్వాలి
కష్టాల కడలిని దరిచేర్చే నావగా
దారితప్పిన వేళ సన్మార్గ శస్త్రంగా
అరణ్యములో అడవిని దాటించే శాస్త్రంగా
దిక్కు తోచనివేళ తానే దిక్కైనట్లుగా
సఖ్యతతో కడదాకా కలిసుండాలి
వెన్నంటి ఉండే నీడ కావాలి
మచ్చిక చేసుకున్న మూగజీవులు
మరణమొచ్చినా మన స్నేహాన్నొదలవు
పొలము దున్ని పసిడి పండిoచు
పాలిచ్చి తల్లివోలే ఆదుకొను ఆవు
కంటికి రెప్పోలే కాపాడు శునకము
సకల చరాచర సృష్టిలో అన్నీ ఆత్మీయ స్నేహాలే తరచి చూడగా..

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి