మత్తేభము:
*పుడమిన్నిన్నొక బిల్వ పత్రమున నే | పూజించి, పుణ్యంబునుం*
*బడయన్నేరక పెక్కు దైవములకుం | పప్పుల్ ప్రసాదంబులుం*
*కుడుముల్ దోసెలు సారెసత్తులటుకుల్ | గుగ్గిళ్ళ్లునుం బెట్టుచుం*
*చెడి, యెందుం కొరగాకపోదు రకటా | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
నువ్వు, ఒక పెద్ద భోళా శంకరుడివి. నీ మీద ఒక ఆకు వేస్తే, ఎంతో విలువైన, ఎవరూ పొందలేని నీ చోటు లో స్థానం ఇస్తావు అనే విషయం ఎవ్వరూ గుర్తు వుంచుకోరు. నిన్ను తప్ప వేరే దేవుళ్ళను పూజిస్తారు. వడ పప్పు, పానకం, జంతికలు, అరిసెలు, ఉండ్రాళ్ళు అన్నీ నైవేద్యాలు పెట్టి అందరినీ మంచి చేసుకునే ప్రయత్నం చేస్తాము. కానీ ఇవన్నీ ఎందుకూ పనికిరావు........అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*ఒక్క నీటి బిందువు నీ మీద వేస్తే, ఒక బిల్వం పెట్టితే, మరుసటి రోజు కూడా అదే బిల్వాన్ని శుభ్రం చేసి ఉంచి పూజచేసాము అనిపిస్తే, కూడా ఏమాత్రం బేధభావం లేకుండా, నీ ప్రేమకు, కరుణకు, వాత్సల్యానికి మమ్మల్ని అర్హులను చేస్తావు. అయినా, పెరటి మొక్క వైద్యానికి పనికిరాదు అన్నట్టుగా, మేము నీ మాయలో పడి, నిన్ను కాదని ఎంతో మంది చుట్టూ ప్రదక్షిణ చేస్తూ వుంటాము. ఎవరిని ఎంత వేడుకున్నా, చిట్ట చివరకు "నీవు తక్క వేరే దిక్కు లేదు" అని గుర్తించ వలసిందే. నీ కరుణారస దృక్కులు సోకినప్పుడు మంచు కొండ కూడా మంచినీళ్ళ గా మారి మా దాహార్తిని తీర్చుతాయి. నీకు నీవే సాటి, ఈశ్వరా!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి