పద్యాలు:-మమత ఐలహైదరాబాద్9247593432

 
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలతో
సీ.
భేదభావము లేక బెంగతీర్చు చెలిమి
      స్నేహముంటే చాలు చింతలేదు
మదిలోని వెతలన్ని మరిపించు స్నేహము
       మనసు తేలికనొందు మాటతోడ
కష్టపెట్టినగాని గరళ కంఠుని వలె
        నిష్టంగ మమతను నింపు యెదన
చెలిమి ధైర్యము వల్ల కలిమెంతొ కూరును
         క్షణము మరువనేని రణమెమదికి
ఆ.వె
మంచి చెలిమి కన్న మించిన వరమేది
చెలిమినిలుపుమెపుడు చింత వీడి
సులభసాధ్యమౌను చుక్కలందుటనైన
మనసు పెట్టి వినుము మమతమాట
దత్తపది:-కర్మము మర్మము చర్మము ధర్మం
ఉ.
కర్మమొ కాలమేమొయని గందరగోళమునందుజిక్కకన్
మర్మమెరింగికల్మషపు మాయనుబట్టిన సేదదీరునే
చర్మము వీడుదాక నిల సాధనతో పనులెల్ల జేయుమా
ధర్మము దైవమై నిలచి దారిని జూపుధరన్ నమ్ముమా!
అంశం:-చక్కనిశిల్పం
కం
చక్కని శిల్పం బైనను
చుక్కబెడుదునంచు పొడువ సొట్టలు బడునే
మక్కువ జేసిన మేలగు
చక్కర కేళిగనుదోచు సత్యము మనసా!

కామెంట్‌లు