సాహిత్యం - స్వాతంత్ర్యోద్యమము :-బెహరా ఉమామహేశ్వరరావు.సెల్ నెంబర్ :9290061336.

 "హితేనా సహితం సాహిత్యం" అనేది ఆర్యోక్తి.
సమాజానికి మంచిని చేకూర్చేది సాహిత్యం, అనే అర్థం ఈ సూక్తి ద్వారా తెలుస్తుంది. మానవ సమాజా
న్ని మంచిని కోరుతూ ఆ దిశగా మళ్ళించే అక్షర స్వరూపమే సాహిత్యం అని చెప్పుకోవచ్చును.
         పూర్వం రాజాస్థానాల్లో కవులు, పండితులు,
రాజులకు ఇష్టమైన పురాణాలను, వారి ,జీవితాలను పరిపాలనా క్రమాన్ని గొప్పతనాన్ని చాటి చెప్పే కవిత్వ
ము సమాజంలో వర్దిల్లేది. ఆనాటి చక్రవర్తులు కూడా
కవులు రాసిన కవిత్వంతో తమ కీర్తి శాశ్వతంగా వర్ధిల్లుతుందని వారి ఆకాంక్ష. కవిత్వం అనేది కేవలం రాజాస్థానాలలో గాకుండా, జన సామాన్యం మధ్య కవిత్వం చెప్పే గొప్ప కవులు ఉండేవారు. ఈ కవి
త్వం ద్వారా ప్రజలలో నైతిక విలువలు పెరగడంతో
పాటు సామాజిక చైతన్యానికి ఎంతో తోడ్పడేది. రాజాస్థానాల్లో ప్రౌఢ కవిత్వం  ప్రభవిస్తే సామాజిక కవుల కవిత్వం ప్రజా భాషలో అనగా వ్యవహారిక భాషలో ఉండేది. వారు రాసిన పురాణాలు, ద్వి పదలు, కథలు పాటలు కవితలతో పాటు వ్యాస రూపంగా కూడా ఉండేది. ఇవిగాక నాటకాలు, నాటికలు, పగటి వేషాలు, జముకుల పాటలు, బుడబుక్కల పాటలు, బుర్రకథలు వంటి అనేక  మాధ్యమాల ద్వారా జనాలలో ఆనందంతో పాటు చైతన్యం కలిగించేవి.
      ప్రజా కవిత్వం జనించడానికి మూలం, సామాజిక మార్పు, జన చైతన్యం  ముఖ్య కారణం అవుతుంది.
ఇటువంటి సామాజిక పరిస్థితులు మన భారత దేశంలో బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేయడానికి, సాహిత్య మాధ్యమం కూడా ఎంతో తోడ్పడిందని చెప్పుకోవచ్చును.
        మన భారతదేశాన్ని ఆంగ్లేయులు చాలా కాలం పాలించారు. వారి పరిపాలనలో  నిరంకుశత్వం ప్రబలింది. అందుచేత బ్రిటిష్ పాలన కింద సంస్థానాల రాజులలో స్వేచ్ఛ  నశించి పోయింది.
ఈ ప్రభావం సామాన్య ప్రజలపై కూడా పడింది. ప్రజలు తాత్కాలికంగా మౌనం వహించినప్పటికీ మనసులలో తీవ్ర గాయమయింది.
    అదే భారతీయులు బ్రిటిష్ వారిపై తిరగడానికి మూల కారణం అయింది.
  ఇందుకు ముఖ్య ఉదాహరణలుగా సిపాయి కలహం. ఇదే ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం క్రీ.శ.1857సం. వచ్చిన తిరుగుబాటు.
 ఆనాడు బ్రిటిష్ వారిపై తిరుగుబాటు చేసిన భారతీయ సంస్థానాధీశులు నానాసాహెబ్, ఝూన్సీ లక్ష్మీ బాయి, తాంతియ తోపే, వంటి మహావీరులు ఎందరో ఉన్నారు. వీరంతా భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారినెదిరించి రణరంగములో అసువులు బాపారు.
        ఈ సమయంలో మంగళ్ పాండే ఆనే మంగళ దేశ్ పాండే ఒక సామాన్య సైనికుడు కూడా దేశ స్వేచ్ఛ కోరుతూ బ్రిటిష్  సైనికాధికారులపై తిరుగు బాటు చేసి ప్రాణాలు అర్పించిన మహావీరుడు. భారత దేశ  చరిత్ర పుటలలో నిలచిన ఘనుడు.
    భారతదేశ స్వాతంత్ర్యోద్యమములో జరిగిన జలియన్వాలా బాగ్ ఉదంతం భారతీయుల గుండెల
  లో తిరుగుబాటును రేకెత్తించింది. ఈ సంఘటన 1919 వ సంవత్సరం పంజాబు లోని జలియన్వాలా బాగ్ లో జరిగింది. శాంతియుతంగా భారతీయులు  జరుపుకుంటున్న ఈసభను, బ్రిటిష్ అధికారి జనరల్ డయ్యర్ కన్ను కుట్టింది. ఈ జూలియన్ వాలా బాగ్
చుట్టూ ప్రహరీగోడ ఏకైక ద్వారం.
  కొన్ని వేల మంది భారతీయులు ప్రశాంతంగా జరుపుకుంటున్న ఈసభను ఆంగ్ల సేనాని జనరల్ డయ్యర్ తన సైనికులను పురిగొల్పి తుపాకులతో
అనేకమంది ప్రాణాలు తీశాడు. నిర్ధాక్షణ్యంగా  గుళ్ళు పేలుస్తూ రక్తసిక్తం చేశాడు. సామాన్య ప్రజలంతా  హాహాకారాలు చేస్తూ, ఒకరిపై ఒకరు పడి కుమ్ము కున్నారు. బయటకు పోయే అవకాశం లేదు.
ఒక్కటే ద్వారం. భయానక దుస్థితిలో ఉన్న ప్రజలను సభికులను గుర్రాలపై వెంటాడి కాల్చిచంపాడు.
భారతీయుల రక్తం ఏరులై పారింది.
ఈ సంఘటన మేధావులకే కాక సామాన్య ప్రజల గుండెల్లో నాటుకుపోయింది.
   దురంతానికి కారకుడైన జనరల్ జె.పి.డయ్యర్
కు తరువాత కాలంలో పక్షవాతం కూడా వచ్చింది. ఇతడు లండన్ లోని కోర్టు నుండి బయటకు వస్తుండగా ఉద్దామ్ సింగ్ అనే భారతీయుడు, పిస్తోలుతో కాల్చిచంపాడు.ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఉద్దాం సింగ్ను ఉరి తీసింది. ఈ సంఘటన  భారతీయుల గుండెల్లో గుచ్చుకుంది.పలు భాషల్లో గీతాలు కవితలు కథలు వ్యాసాలు అనేకం వచ్చాయి. శాంతియుత పోరాటాలకు నాంది పలికింది. అంతేకాదు భారతీయ సాహిత్యం పెల్లుబికింది.    
         భారతీయులలో ఐక్యత భావానికి, ఈ ఘటన పురిగొల్పింది. ఇలాంటి సంఘటనలు అనేకం ఆ తరువాత స్వాతంత్రం పోరాటం కోసం గాంధీ నెహ్రూలు, పటేల్, టంగుటూరి. సరోజినీ దేవి వంటి నాయకులకు ముందు నిలిపింది.(సశేషం)
       
కామెంట్‌లు
Unknown చెప్పారు…
Chalaa bavundhi sir