శివ సూక్తులు – పెద్ది సాంబశివరావు: 94410 65414, peddissrgnt@gmail.com


 నీరు, నిద్రలేక తిరిగె రాష్ట్రమ్మంత
నటుడు నందమూరి నేత గాగ
జగతి ప్రజలు చకితులై చూసిరే
పనిని చేయ పిదప ఫలితముండు.

టెన్నిసాటయందు వన్నెకెక్కెను తండ్రి
అతని మించినాడు సుతుడు కూడ
మార్గదర్శకులైరి మాష్టరు కృష్ణన్ లు
పెద్దవారికి మరియు పిన్నలకును. (1985)

చదువు రాని మొద్దు అనబడ్డ ఎడిసను
ఎటుల కనుగొన గలిగె తెలియుమయ్య
కొత్త శోధనలను కొల్లగా వందలు
విసుగు లేక పనులు చేయు మటుల.

డైనమైటు నెరిగి డబ్బు సంపాదించి
కొంత నిల్వ జేసె శాంతి కొరకు
ఏర్పరచెను వివిధ నోబెల్ బహుమతుల
పరుల మేలుగోరి పంచు మట్లు.

తాటియాకు రాత మోటయి పోవగా
అచ్చు గొట్ట నేర్పె అందమొప్ప
గొప్పవాడు గాడె గూటెను బర్గు యున్
వేల పుస్తకాలు వెలుగు నింపె.


                             ***
కామెంట్‌లు