నవసమాజం గేయం:-కటుకం రాజయ్య--చరవాణి సంఖ్య:9441560232

 పల్లవి:గాలికి ఏకులమున్నది ఈ నేలకు ఏకులమున్నది
గాలికిలేని నేలకులేని మనిషికి ఎందుకు ఈ కులము
ఈ మనిషికి ఎందుకు ఈ కులము
తెల్లని మల్లెల తెలివిని బెంచె
కమ్మని రుచులను పంచె
పశువుల కేకుల మున్నది
వాటిపాలకు ఏకుల మున్నది
                  "గాలి"
జ్ఞానము బెంచి విజ్ఞానము బంచే
ప్రాణము గాచి ఫలముల నొసగే
చెట్లకు ఏకులమున్నది బడి మెట్లకు ఏకులమున్నది
చెట్లకులేని బడిమెట్లకులేని
గుడి మెట్లకు ఎందుకు ఈ కులము
           "గాలి"
పంచభూతములు  పరులకు హితమును
వంచన లేకను వసుధలో నొసగును
ఎండకు ఏకులమున్నది
మండే మంటకు ఏకులమున్నది
ఎండకులేని మంటకులేని
మనిషికి ఎందుకు ఈ కులము"2"
       "గాలి"
ఏకులములో బుట్టిన ఏమతములో బుట్టిన
మానవత్వము మరుకుమెపుడు
నీవుఎదుగుతు నీతోటివారికి
చేత నయ్యిన మేలును జేయుము
          "గాలి"
అంటు ముట్టుడు అవనిలో వదిలి
మంచి తనమును మనసులో బెంచి
కులములేని మతము లేని
నవసమాజముకు నడుము గట్టుము
         "గాలి"
కామెంట్‌లు