జీవన రాగం .. !! > (ఆన్షి లు ) >డా . కె . ఎల్ . వి . ప్రసాద్ >హన్మకొండ (9866252002)*

బ్రాందీ షాపులు తెరిచారని బడాయి వద్దులే 
రెట్లు తెగ పెంచేసినా రెచ్చిపోయి కొనబోకులే 
వళ్లు గుల్లచేసుకుని దానికి బానిసౌటతగునా?
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

ఉన్నవారికి అది చెల్లుబాటు అగునేమో కానీ 
కష్టజీవిముచ్చట పడిమద్యపానానికి దాసుడై 
బ్రతుకు రోడ్డుకెక్కినడి బజారు పాలుకాడా .. !
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!

పేదవాడి కడుపుకొట్టి ప్రభుత్వాలు బ్రతుకుతాయ్ 
అదే డబ్బుఆశజూపిపార్టీలు ఓట్లు కొల్లగొడతాయ్! 
నిజము తెలిసి బ్రతకకుంటే నిండామునిగిపోతారు ,
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !! 

‘విడో’ ల కాలనీలు కట్టి వింత ఆలోచన చేయుటేలా ?
మద్యం తెగ ఆశజూపి మరణానికి బాటవేయుటయా!
బ్రతుకు భవిత గుర్తెరిగి తెలివిగా ప్రవర్తించవలె కదా .. 
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!

పార్టీలు అంటేనే మందుపార్టీలుగా మారిపోయే .. 
ఆడ -మగా  తేడాలేకుండా క్లబ్బులు నిండిపోయే 
మద్యపాన సేవనము ఆరోగ్యానికి హానికరము !
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము .. !!

మద్యము తెగతాగి మోటారు నడుపు వారలు 
వళ్ళుతెలియక వాహనమును పరిగెత్తింతురు 
మృత్యు గృహమునకేగి మరణించుటఏలనో ?
వినుము కేఎల్వీమాట నిజ ము సుమ్ము .. !!

ముచ్చటపడి సంతోషముగా మందు సేవించి 
అంతులేని వేగముతోకారునుపరుగులెత్తించి ,
పోలీసులకంటపడి పరువు పోగొట్టుకొనుటేల?
వినుము కేఎల్వీ మాట నిజ ము సుమ్ము !!

కామెంట్‌లు