పేరడిపద్యాలు:- *మిట్టపల్లి పరశురాములు* *సిద్దిపేట* *చరవాణి:9949144820*

 *కం*
ఇమ్ముగతెలుగేజదివియు
మమ్మియనిపలకనేలమాయలనరుడా!
అమ్మబ్రతికుండగానే
గుమ్ముగదయ్యమునుజేయగూడదురామా
*కం*
ఉదకములేకనెబ్రాందీ
మదముననుమనిషియెత్రాగమత్తేభములా
వాదముచేయుచునెగబడ
మోదముననువిడువవచ్చుముచ్చటతోడన్

కామెంట్‌లు