యువత - నడత:- కాకర్ల రమణయ్య-: గుడిపాటిపల్లి- 9989134834
సాహితీ కవికళా పీఠం 
సాహితీ కెరటాలు 
=============
వేసవి దారులై పరచుకున్న
నగ్న పాదాలకు ,
రక్షణలై ఎదురొచ్చిన
పాదరక్షల చిరు స్పర్సే  మౌన ప్రేమ..! ,

ఎముకల గూడుపై అల్లిన 
చర్మపు తడికను  వస్త్రాల
దుప్పటి ఆలీంగణ
అనుభూతే మౌన ప్రేమ..!

 గుప్పెడు మెతుకులకొఱకు అంగలార్చే ఎండిపోయిన డొక్కకి 
గుక్కెడు గంజి ఆత్మీయ
 ప్రవాహమే మౌన ప్రేమ..!


బంగారు కలలు కనే కనులకు
ఒక్క కల నిజమైనా..!
కలకు నిజానికి మధ్య
అనుబంధమే మౌన ప్రేమ..!


కాళీ బడి సంచిలో 
కొత్త పుస్తకాల  పరిమళమే ,
బడిసంచి,పుస్తకాల మధ్య 
మౌన ప్రేమ ..!

మనసు గోడలకు అహంకారపు
తెరలు ముసురుకొనక పోతే,
ప్రకృతి సర్వస్వం పై 
మనిషికి మౌన ప్రేమ విస్తరిస్తుంది..!

మానవాళి సమస్తం 
రసానుభూతితో మై మరుస్తుంది..!

కామెంట్‌లు