తీర్పు ..!! > శ్యామ్ కుమార్ .--రచయిత > నిజామాబాదు .

 పై చదువులకు వెళ్ళిన ప్రతి ఒక్కరికి కాలేజీ మెట్లు ఒక బంగారు లోకంలో కి దారి తీసే విధంగా ఉంటాయి.  పద్మవ్యూహం లాంటి అందులోకి అందరూ  ఉత్సాహంతో పరుగులు పెడతారు  కానీ కొందరు మాత్రమే   విజేతలుగా తిరిగి వస్తారు.  వారే   జీవితంలో కూడా విజయం సాధిస్తారు.  
కాలేజీలో చదివే మూడు సంవత్సరాలు ,రాగద్వేషాలతో తెలియని ఆవేశాలతో ,అర్థంకాని ప్రేమలతో , అర్థంలేని విద్వేషాలతో ,  మిత్రత్వంతో శత్రుత్వంతో గడిచి పోతాయి.  ఆ సమయంలో శత్రుత్వంతో ద్వేషాలతో కూడిన చర్యల వల్ల కొన్నిసార్లు నష్టం కూడా వాటిల్లుతుంది.  తెలిసీ తెలియని వయసులో చేసిన పనులతో  జరిగిన నష్టానికి ఎవరిని బాధ్యులను చేయలేం.  అంతిమంగా   మంచితనానికే  విజయం  అన్న సూత్రంతో జరిగిన కొన్ని సంఘటనలు అసలు మరచిపొలేము !
 కలలను సాకారం చేసుకునే దిశగా సాగిన ప్రస్థానంలో కాలేజీ  మెట్లు ముఖ్యమైనవి.  చదువు మరియు జీవితం విషయంలో ఒకటే దృక్పథం కలిగిన మేము ఐదుగురం  గవర్నమెంట్ గిరిరాజ్ కాలేజ్ నిజామాబాదు లో కలిసి చదువు సాగించాం.
 కో-ఎడ్యుకేషన్ కావటం మూలాన అమ్మాయిలతో మాకు మంచి స్నేహం ఉండేది.
 చదువే పరమావధిగా వాతావరణం ఉండేది.  దానికి ముఖ్య కారణం మాకు ఉన్న ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులే  అన్నది ఎవ్వరూ కాదనలేని సత్యం.
 అందరిలోకి మా క్లాసులో ఉన్న పద్మజ మాత్రం  మేమంటే, ఇంకా ముఖ్యంగా   మాలో ఒకడైన   వేణుగోపాల్ అంటే  అకారణ ద్వేషం పెంచుకుంది .  వేణుగోపాల్  మాత్రం పద్మజ అంటే అభిమానంతో    చూసేవాడు.    క్లాసులో పాఠం జరుగుతున్నంతసేపు అమ్మాయినే గమనిస్తూ ఉండేవాడు.  ఇద్దరూ పోటాపోటీగా చదివే వారు.  అన్నిటిలో మొదటి మార్కు తెచ్చుకొనే వేణుగోపాల్  జువాలజీ లో మాత్రం పద్మజ కు ఎదురు నిలబడ లేకపోయాడు.  ఎప్పుడూ అందులో ఒకటి రెండు మార్కులు తక్కువగా వచ్చేవి.  మాస పరీక్షలు, త్రైమాసిక పరీక్షలు జరిగిన తర్వాత ఎన్ని మార్కులు వచ్చాయి అనేది కాకుండా ఎవరికి ఎక్కువ అనే విషయంలో ఇద్దరు ఎప్పుడూ టెన్షన్ పడుతూ ఉండేవారు .
 అమ్మాయి పెద్ద అందగత్తె కాదు కానీ కళ గా ఉండేది.  నిజం చెప్పాలంటే మా కాలేజీలో ఉన్న అమ్మాయిలందరూ కూడా మాకు అందంగానే కనిపించే వాళ్ళు ఆ రోజుల్లో.  చాలావరకు అమ్మాయిలందరూ మాకు రాఖీలు కట్టేవారు.  ఆ తర్వాత వారిని ఎవరు ఇబ్బంది పెట్టినా మేము వారి మీద పోట్లాటకు వెళ్లాల్సి వచ్చేది అది వేరే విషయం.
 రెండు జడల లో ఒకటి ముందుకు ఒకటి వెనక్కి వేసుకొని  ఓ ణి  తొ  వచ్చేది పద్మజ.     ఎప్పుడైనా ఒకసారి చీర కట్టుకొని వస్తే  వేణుగోపాల్  సంతోషము ,చెప్పనలవి కాదు.   అకారణంగా   మా వాడి  మీద ఏదో రకంగా ఉపాధ్యాయులకి తను కంప్లైంట్ చేస్తూ ఉండేది.  వీడు మాత్రం ఆ అమ్మాయిని ఏమీ అనేవాడు కాదు. 
 మా క్లాసులో ఉన్న 16 మంది విద్యార్థులలో   నేను వేణుగోపాల్ తప్ప అందరూ  ఏదో ఒక దగ్గరికి  కెమిస్ట్రీ ట్యూషన్ కి వెళ్లే వారు.  ఆ రోజుల్లో  ఒక సబ్జెక్ట్  చెప్పడానికి సంవత్సరానికి ఐదు వందల రూపాయలు ఫీజు తీసుకునేవారు.  కాలేజీలో కెమిస్ట్రీ మాకు అర్థం కాని   పద్ధతులలో లెక్చరర్ బోధించేవారు.
 " అర్థం అయిందా?" అన్న ఆయన ప్రశ్నకు మేము కాలేదని  సమాధానం  చెబితే మాకు చదువుకునే విధానాలు మరియు క్లాసులో ధ్యానం పెట్టి వినాలని సూచనలు ఇచ్చేవారు తప్పితే మళ్లీ విశదీకరించి గానీ   సరళ తరంగా కానీ చెప్పేవారు కాదు.  వేణుగోపాల్ ,నేను తప్ప అందరూ  ట్యూషన్వెళ్లేవారు  కాబట్టి ఎవరూ ఏమీ మాట్లాడేవారు కాదు.  ఇలా దాదాపుగా ఆరు నెలలు గడిచిన తర్వాత కెమిస్ట్రీ సబ్జెక్టులో వేణుగోపాల్ వెనుకబడి పోయాడు. వాళ్ల  నాన్నగారి ఆర్థిక స్థోమత సహకరించక పోవడం వలన వాడు ట్యూషన్ కి వెళ్ళలేదు.  ఆ రోజుల్లో చంద్రశేఖర్ గారు   కెమిస్ట్రీ చాలా బాగా  చెబుతారు అని పేరు ఉండేది.  ఆయనతో వేణు  నాన్నగారికి పరిచయం ఉండేది.  తప్పనిసరి పరిస్థితులలో వేణుగోపాల్ , చంద్రశేఖర్ గారి దగ్గరికి వెళ్ళాడు.  ఆర్గానిక్ కెమిస్ట్రీ లో ఎదురవుతున్న ఇబ్బందులను తెలియజేశాడు. 
 "సాయంత్రం సమయంలో 6 గంటలకు నేను  ట్యూషన్ చెబుతున్నాను,  నువ్వు   కూడా రా" అన్నారు చంద్ర శేఖర్ గారు. 
 అప్పుడు ఏం చేయాలో తెలియక చేతులు కట్టుకుని వేణుగోపాల్ సమాధానం చెప్పాడు
" సార్ నేను   మీకు ట్యూషన్ ఫీజు ఇచ్చుకోలేను నా పరిస్థితులు అలా ఉన్నాయి" అన్నాడు.
" అదేంటి వేణుగోపాల్, నేను నీ దగ్గర డబ్బులు తీసుకొను కదా !మీ నాన్నగారు నాకు మంచి స్నేహితులు,నీవు  రా .అవన్నీ ఆలోచించవద్దు"
 అని అభిమానంగా భుజంతట్టి పంపించారు.  ఆ తర్వాత వేణుగోపాల్ మా దగ్గరికి వచ్చి ఇదంతా చెప్పి కళ్ళలో నీళ్ళు పెట్టుకున్నాడు.    మా అయిదుగురులో వాడుతప్ప మేమందరం ఆర్థికంగా  ఉన్నతంగా  ఉండేవాళ్ళం.   వాడికి కావలసిన టెక్స్ట్ బుక్స్, నోటు బుక్కులు, పెన్నులు, మాకు వీలైనంత వరకు వాడికి సహాయం చేసే వాళ్ళం.  వాడికి మేమంటే చాలా ప్రాణంగా ఉండేది.  డబ్బులు పెట్టడానికి వీలు ఉండేది కాదు కాబట్టి వాడు ఎప్పుడూ మాతో        సరదాలకు ,సినిమాలకు రావడానికి వెనుకంజ వేసే వాడు.  మేము అది గమనించి వాడిని బలవంతంగా తీసుకొని వెళ్ళేవాళ్ళం.
 మరుసటి రోజు చంద్రశేఖర్ గారు చెప్పిన సమయానికి మా వాడు వారి ఇంటికి ట్యూషన్ కి వెళ్ళాడు. అక్కడ మా క్లాసు లోని నలుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అందులో పద్మజ కూడా కూర్చుని ఉంది. 
 ఆరోజు ట్యూషన్ క్లాసు మామూలుగా జరిగింది.
 పద్మజ కూడా ట్యూషన్ కు వెళుతున్న సంగతి మాకు అప్పుడే తెలిసింది. "అయితే పద్మ కూడా నాలాగే కెమిస్ట్రీలో  మొద్దు   అన్న మాట" అన్నాడు నవ్వుతూ వేణుగొపాల్ .
 ఆ తర్వాత మూడు రోజులు వరుసగా పద్మజ ట్యూషన్ క్లాసుకు రాలేదు అని చెప్పాడు. మేము అది విని" రాకుంటే ఏడవని! నీకెందుకురా?? తన గురించి?" అని  చీవాట్లు పెట్టాం.
 కానీ నాలుగవ రోజు వేణుగోపాల్ ఎదురుచూడని చాలా విచిత్రమైన సంఘటన జరిగింది.
 పద్మజ తన తల్లి గారితో కలిసి చంద్రశేఖర్ లెక్చరర్ గారింటికి వచ్చిందట.  "మీరు వేణుగోపాల్ కు ట్యూషన్ చెప్పకూడదు,  ఆ అబ్బాయి వస్తే మా అమ్మాయి పద్మజ మీ దగ్గరకు ట్యూషన్ కు రాదు !"  అని తేల్చి చెప్పిందట. ఈ విషయంలో చంద్రశేఖర్ గారు ఎంత నచ్చజెప్పినా కూడా వాళ్లు వినలేదని తెలిసింది.  
ఇందులో ఇంకొక గొప్ప విషయమేమిటంటే ,చంద్రశేఖర్ గారు   జరిగిందంతా తన కెమిస్ట్రీ డిపార్ట్మెంట్లో చెప్పి ఈ సమస్యకు పరిష్కారం చెప్పమని వారి యొక్క గురువు గారిని అడిగారట.  జరిగిందంతా విని ఆలోచించి చాలా సింపుల్ గా వారి గురువు గారు   ఖరాఖండీగా చెప్పిన సమాధానం ఏమిటంటే" మన దగ్గర చదువుకొడానికి,  నేర్చుకోవటానికి ఎవరు వస్తే వాళ్ళకి మనము చదువు చెబుతాం. రానివారికి చెప్పము!" అని. 
 జరిగిన ఈ విషయం అంతా విపులంగా వేణుగోపాల్ కి చంద్రశేఖర్ గారు వివరించి     ఆఖరికి ఏమని సలహా ఇచ్చారు అంటే "వేణుగోపాల్ ! నువ్వు బాగా చదువుకో, ఇవన్నీ పట్టించుకోవద్దు. అయినా  నీకు ఒక విషయం చెప్తాను,  ఆ అమ్మాయి క్వీన్ విక్టోరియా లాగా అందగత్తె కూడా కాదు. ఎందుకు చెప్పు ?నీకు ఇవన్నీ? వదిలేయ్. మనకు చదువు ముఖ్యం."
 తను ఉన్న పరిస్థితుల్లో" సరే ,సార్ !!"అనడం తప్ప ఇంకేమి చెప్పవలసిన అవసరం లేదు అనుకొని వూరుకున్నాడట. 
 ఆ తర్వాత జరుగుతున్న  ఫైనల్ ఇయర్ పరీక్షల సమయంలో జువాలజీ ప్రాక్టికల్  లో ఇంకా విచిత్రమైన సంఘటన జరిగింది.
 అందులో ముందుగా చేయబోతున్న  ప్రాక్టికల్ పరీక్షలకు సంబంధించి డయాగ్రమ్ వేసి దాని గురించి రాసి ఎగ్జామ్ మేరకు ఇచ్చి వేయాలి. తర్వాత ప్రాక్టికల్గా డిసెక్షన్  చేయవలసి ఉంటుంది.  పరీక్ష మొదలైన కాసేపటికి మేము రాసిన ఆ పేపర్లు తీసుకోవడానికి వచ్చిన లక్ష్మీనారాయణ గారు  పద్మజ పేపర్ చూసి చాలా సీరియస్ గా తిట్టడం మొదలు పెట్టాడు.  ఎప్పుడు జువాలజీ సబ్జెక్ట్ లో అందరి కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకొనే  లక్ష్మీనారాయణ గారి ఫేవరెట్  పద్మజ ఆ పరీక్ష లో అన్ని తప్పులు రాసేసింది.   అది చూసి లక్ష్మీనారాయణ గారు" ఏం రాశావ్ "నీ మొహం రాసావ్ .ఇది ఏంటి. నీకు సున్నా మార్కులు వస్తాయి. ఫెయిల్ అయిపోతా ఫైనలియర్లో" . అని తిట్టి " వేణుగోపాల్ !నీ పేపర్ ఇవ్వు ."అని తీసుకొని ఆ అమ్మాయికి ఇచ్చి" ఇది చూసి రాసుకో" అని వెళ్ళిపోయాడు. అయినా సరే మా వేణు ఏమీ అనలేదు చాలా సీరియస్గా ఆ తర్వాత  తన పేపర్ తీసుకొని  పరీక్ష పూర్తి చేసి  వచ్చేసాడు.  ఆ విధంగా ఆ కారణంగా ఎన్నో సార్లు  వేణు ని ఇబ్బంది పెట్టి  వాడిని ద్వేషించిన అమ్మాయికి తగిన సమాధానం   కాలమే చెప్పింది. జీవితంలో పద్మజ ఎదురుచూడని ఓటమి వేణుగోపాల్  నుంచి  వాడి ప్రమేయం అసలు లేకుండా జరిగింది.   ఆ తర్వాత అన్నిపరీక్షల లోనే కాకుండా కెమిస్ట్రీ లో కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి జీవితంలో మంచి స్థానంలో సెటిలయ్యాడు వేణుగోపాల్.
 ట్యూషన్ ఫీజులు ఇచ్చే విద్యార్థిని కాదని ఏమి ఇచ్చే పరిస్థితులు లేని విద్యార్థికి చదువు చెప్పడం అన్నది ఎంత ఉన్నతమైనదో  మాకు తెలిసింది .  చంద్రశేఖర్ గారి లాంటి ఉన్నతమైన  సంస్కారవంతులు  ఉండటం వలన ఎంతో మంది విద్యార్థుల జీవితాలు బాగు పడ్డాయి.
 శ్రీ చంద్రశేఖర్ సర్ గారు రిటైర్మెంట్ అయిన తర్వాత  మేము  వెళ్లి కలిసి మాట్లాడుతూ ఈ విషయం ప్రస్తావనకు  వచ్చినప్పుడు ఆయన ఒక మాట అన్నారు. " చూడండి  బాబు!  జీవితంలో డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు.  డబ్బే  అన్ని అనుకుంటే ఎలా చెప్పండి" అని.  
 కాలేజీ అయిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత వేణుగోపాల్, చంద్రశేఖర్ గారి ఇంటికి వెళ్లి కృతజ్ఞతలు తెలిపి ,చేతిలో కాస్త డబ్బు పెట్టబోయాడు.  దానిని ఆయన సున్నితంగా   తిరస్కరించి   "మీరందరూ బాగుపడ్డారు. అది చాలు మాకు,  అదే మాకు మీరిచ్చే లక్షల రూపాయలు "అని నవ్వేశారు.  ఇంతకూ   చంద్రశేఖర్ గారి   ధర్మంతో కూడిన సలహా ఇచ్చిన యొక్క  గురువు ఎవరు అనుకుంటున్నారు?  ఆయన పేరు శ్రీ ప్రభాకర్ రావు గారు.  (కెమిస్ట్రీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్)
గురుబ్రహ్మ. గురువిష్ణు. గురుదేవో మహేశ్వర .గురు సాక్షాత్ పరబ్రహ్మ .తస్మై శ్రీ గురవే నమః. నాటి 
గురువులు అలా మరి...!!

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
కాలేజీ రోజుల్లో సంఘటనలు అత్యద్భుతం గా వివరిస్తున్న
శ్యామ్ కుమార్ అభినంద నీయుడు.ఆయనకు శుభాకాంక్ష లు
Shekar sharma.nizamabad చెప్పారు…
జీవితంలో మనిషి ఎదగాలి అంటే మంచి *సహవాసం* కావాలి!
ముందు *తల్లిదండ్రులు*
లేదా వాళ్ళ స్థానంలో ఉన్న *గార్డియన్*వాళ్లు సరైన మార్గంలో వాళ్ల పిల్లల్ని తీర్చిదిద్దాలి!

ఆ తర్వాత పాఠశాలలో గురువు ఉపాధ్యాయుడు!
విద్యార్థి యొక్క మానసిక పరిస్థితి నిగ్రహించుకొని సరైన ఒక ఉపాధ్యాయుడు కనుక అయితే ఆ విద్యార్థిని మంచి తోవలో నడిపించే ప్రయత్నం చేస్తాడు!

అలాగే ఉత్తమ మైనటువంటి స్నేహితులు
ఉత్తమమైన కంటే స్నేహితులు తన తోటి వారిని వాళ్ళు ఉత్తమంగా నడుచుకుంటూ లోపాలను సరిదిద్ది ముందుకు తీసుకెళ్తుంటారు!

అలాగే ఒక వ్యక్తి తాను అభ్యున్నతి ప్రగతి జ్ఞానము పొందాలి అని తాను కూడా నిరంతరం అధ్యయనం చేస్తూ సద్గురువులను ఆశ్రయించి తన లోపాలను తప్పులను సరిదిద్దు కుంటూ మంచి మార్గంలో నడిచే ప్రయత్నం తాను స్వయంగా కూడా చేయాలి!

అప్పుడు వ్యక్తి కూడా ఉత్తమ తమ్ముడు గా తీర్చిదిద్ది తాను ఇంకొకరికి మార్గదర్శకం చేసే స్థాయిలో ఉండగలుగుతాడు!
అది మీ జీవితంలో లో గమనించు కొని నడుచుకోవడం వల్ల ఒక ఉన్నత స్థాయిలో నిలబడ్డారని మీ యొక్క జీవిత విశేషాలు కొన్ని సంపుటాలు చదవడం వల్ల అర్థం అవుతున్నది!
Teenage
*13 నుంచి 19* సంవత్సరాల వయస్సు వరకు
ఏ వ్యక్తి అయితే మంచి మార్గంలో నడుచుకొని విద్యను అభ్యసించి ఒక స్థాయిలో నిలబడగలుగుతాడో
అప్పటి నుంచి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు !ఎన్ని కష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుని ప్రగతికి బాటలు వేసుకుంటూ పోతుంటాడు!
కాబట్టి దీనికి మన పూర్వ జన్మ సుకృతం, తల్లిదండ్రుల పెంపకం సత్ప్రవర్తన, సద్గురువుల ఆశీర్వాదం మంచి మిత్రులు, మనల్ని మనం మన సమీక్షించుకోవడం!
మనలోని ఉత్తమ అయినటువంటి నడవడికకు మన మన స్థాయి నిర్ణయించే మార్గాలు!
Akula.chandra shekar. Lecturer. GG college.nizamabad చెప్పారు…
I was very much pleased with your narrative so beautifully explained our teacher Student relationship that we enjoyed during our college days in Govt .Giriraj college.Those were my" Golden days" of my life as lecturer and Hod,incharge PPL.Those were the days teacher and student relation were very good.I observed that students of Giri Raj College wer very highly competative irrespective of the faculty to which they belong.
As u know me that I used to be very active in extra circular activities specially in sports and in other social activities.
In your narrative u have written that every student enters into college with" Golden dreams" true that some of them become successful and other may not reach their goals. Some times in students in that age cannot decide which is good and bad,due to confused mind.
You have mentioned that success can be achieved by persiverence hard work and sincerety.ultimately u fullfill ur Golden dreams. It is true I agree with u.
How u your friend have respected co girl
Students.How you have experienced unpleasant moments with miss Padma (Laxmi).Inspite of that you had all the respect for her.This is the greatest quality that you and your friends had.I thank you all our tution batch students for maintaining peace ful atmosphere to continue our journey towards success.
Next thing is you have paid great tribute for PPL and lecturers.I than u for the same.
A tribute and appreciation for me has moved me very much thank you. One more thing to remember is how you and I have faced critical times courageously,peacefully. The fee matter that you have mentioned was the least I could had done at that time .I feel today that I should have done better than what I did.
I am proud to have student like you who has loved me whole heartedly for what little I have done to our tution batch students.I donot remember their names. Convey my thanks and best wishes to them.
I am happy that you have given good guidance and education to your children to put them in good position.
Lastly I want share our college days with our tution students when I visit Nzb.
With love and affection.

Your sir
Chandra Shekar.
Sujatha. T. Mumbai/ bobbili చెప్పారు…
హాయ్
Sooo much deferent from my generation now generation
Now days no complaints to any principal
They talk directly
But u write very well
What was life college education
How guys r behaved with girls
They could n’ t express their feelings
అజ్ఞాత చెప్పారు…
నటీనటులు: మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల తదితరులు
దర్శకుడు: ఏ . సుశాంత్ రెడ్డి
నిర్మాత: అర్జున్ దాస్యన్
సంగీత దర్శకుడు: హరి గౌర
సినిమాటోగ్రఫీ: ఐ ఆండ్రూ
ఎడిటర్: ప్రవీణ్ పూడి


మేఘా ఆకాష్, ఆదిత్ అరుణ్, అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ”డియర్ మేఘ”. ‘వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్’, బ్యానర్ పై అర్జున్ దాస్యన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ ఎమోషనల్ ప్రేమ కథా చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ప్రేక్షకులను ఈ చిత్రం ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం !

కథ :

మేఘా స్వరూప్ (మేఘా ఆకాష్) కాలేజీ రోజుల్లోనే అర్జున్ (అర్జున్ సోమయాజుల)తో ప్రేమలో పడుతుంది. అయితే, ఆమె తన ప్రేమను వ్యక్త పరచాలని నిత్యం తనలో తానే మదన పడినా అర్జున్ తో ప్రేమ గురించి మాట్లాడలేకపోతుంది. మళ్ళీ మూడేళ్ళ తర్వాత అర్జున్, మేఘ జీవితంలోకి వస్తాడు. ఇద్దరు ఆలోచనలు ఒకేలా ఉన్నాయని, ఇద్దరి పరిస్థితి ఒకటే అని అర్థమవుతుంది. ప్రేమ మొదలవుతుంది. పెళ్లితో ఒక్కటి అయ్యేలోపు జరిగిన ఓ ప్రమాదం, మేఘ జీవితాన్ని తలక్రిందులు చేస్తోంది. ఆ పరిస్థితుల్లో మేఘాకి తారసపడతాడు ఆది (ఆదిత్ అరుణ్). అతని స్నేహంలో మేఘా మళ్ళీ మామూలు మనిషి అవుతుంది. ఆది – మేఘా ప్రేమలో పడతారు. కానీ అర్జున్ రాకతో వారి ప్రేమ ఎలాంటి మలుపు తీసుకుంది ? అసలు జరిగిన ప్రమాదంలో అర్జున్ కి ఏమైంది ? చివరకు ఆది కథ ఎలా ముగిసింది ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

ప్లస్ పాయింట్స్ :

”డియర్ మేఘ” అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలతో వచ్చిన దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి, ఈ సినిమా క్లైమాక్స్ తో కాస్త కొత్తగానే ప్రయత్నం చేశాడు. ఇక ప్రధాన పాత్రలో నటించిన మేఘా ఆకాష్ తన లుక్స్ అండ్ యాక్టింగ్ పరంగా బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో కొత్తగా కనిపించడానికి ఆమె బాగానే తాపత్రయ పడింది.

ఎప్పుడూ సరదాగా తిరిగే కుర్రాడి పాత్రలతో మరియు తన ఈజ్ యాక్టింగ్ తో ఆకట్టుకునే ఆదిత్ అరుణ్ నుండి.. ఇలాంటి సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ రావడంతో ఫ్రెష్ గా అనిపించింది. ఆదిత్ అరుణ్ కూడా ఆది పాత్రలో చాలా బాగా ఒదిగిపోయాడు. మరో కీలక పాత్రలో నటించిన అర్జున్ సోమయాజుల నటన పరంగా పర్వాలేదు అనిపించాడు.

ఇక ఈ సినిమాలో ప్రేమ సన్నివేశాలతో పాటు, కొన్ని భావోద్వేగ సన్నివేశాలు మరియు క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. మదర్ క్యారెక్టర్ పోషించిన పవిత్రా లోకేష్ కూడా తన పెర్ఫార్మెన్స్ తో మెప్పించింది. అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు. సినిమాలో గౌర హరి అందించిన సంగీతం సినిమాకి బాగా ప్లస్ అయింది.

మైనస్ పాయింట్స్:

దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి ప్యూర్ లవ్ కి సంబంధించి మంచి స్టోరీ లైన్ ను తీసుకున్నారు, కానీ.. ఆ లైన్ ను పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. మేఘ – అర్జున్ మధ్య సాగే సీన్స్ స్లోగా సాగుతాయి. అలాగే వారి ప్రేమకు బలమైన సంఘర్షణ కూడా లేదు. ఇక ఆది – మేఘ లవ్ ట్రాక్ బాగున్నా.. వీరి మధ్య అనవసరమైన ల్యాగ్ సీన్స్ ఎక్కువైపోయాయి.

పైగా సినిమా స్లో నేరేషన్ తో బోరింగ్ ట్రీట్మెంట్ తో సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని కీలక సీన్స్ మరియు బైక్ యాక్సిడెంట్ సీన్ మినహా మిగతా సీన్స్ పూర్తి స్థాయిలో ఆకట్టుకోవు. ఇక సెకెండాఫ్ ని కాస్త ఎమోషనల్ గా నడుపుదామని దర్శకుడు బాగానే ప్రయత్నం చేశాడు, కొన్ని చోట్ల ఆ ఎమోషన్, ఆ ఫీల్ బాగానే వర్కౌట్ అయినా.. అవసరం లేని సీన్స్ కారణంగా సినిమాకి కొంత మైనస్ జరిగింది.

సాంకేతిక విభాగం :

సాంకేతిక విభాగం గురించి చెప్పుకుంటే.. సంగీత దర్శకుడు గౌర హరి అందించిన పాటల్లో రెండు బాగున్నాయి. ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య వచ్చే లవ్ సాంగ్ బాగుంది. అలాగే కొన్ని సన్నివేశాల్లో ఆయన అందించిన నేపధ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ఎడిటింగ్ జస్ట్ ఓకే అనిపిస్తుంది. బోర్ కొట్టించే కొన్ని సన్నివేశాలను ఎడిటర్ తన ఎడిటింగ్ తో మ్యానెజ్ చేయలేకపోయారు. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాలో దృశ్యాలన్నీ చాలా అందంగా చూపించారు. ముందే చెప్పుకున్నట్లు దర్శకుడు ఏ . సుశాంత్ రెడ్డి తన దర్శకత్వంతో ఆకట్టుకున్నా.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేకపోయారు. ఇక సినిమాలోని నిర్మాత అర్జున్ దాస్యన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.


తీర్పు :

ఎమోషనల్ లవ్ స్టోరీలతో వచ్చిన ఈ ‘ డియర్ మేఘ’లో లవ్ సీన్స్, ఎమోషనల్ గా సాగే ఫీల్ గుడ్ క్లైమాక్స్ ఆకట్టుకున్నాయి. కాకపోతే స్లో నేరేషన్, కొన్ని చోట్ల బోరింగ్ ట్రీట్మెంట్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే, లవర్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా ఈ సినిమాలోని కొన్ని అంశాలు నచ్చుతాయి. కానీ మిగిలిన వర్గాల ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చకపోవచ్చు.

123telugu.com Rating : 2.75/5