సుబ్బారావు, అప్పారావు, పట్నంలో ఉద్యోగం చేస్తున్నారు. ఒకే గదిలోనే ఉన్నా
కంచాలు, మంచాలు వేరే,వేరే!!
రెండు రోజులు సెలవులొస్తే, అప్పారావు,
ఉరికి వెళ్లి వొచ్చాడు . "ఊళ్ళో ఎలా గడిపావ్", అని సుబ్బారావు అడిగాడు .
"చాలా బాగుంది . లాభంగా తిరిగొచ్చాను",
అన్నాడు అప్పడు (అప్పారావు). "అదెలా?" క్రొశ్నిచాడు
సుబ్బడు(సుబ్బారావు). అప్పడు ఇలాచెప్పినాడు.
"బస్ దిగి వీధిలో పోతుంటే, అప్పుడే
అనసూయ, ముగ్గేయ్యటానికి, వాకిట్లోకి
వచ్చింది . తనను చూసి , ఏం అప్పారావు
ఎప్పుడు రావటం ? "అని అడిగింది. "నువ్వు .. నువ్వు కన్నప్పుడే " అన్నాడు.
అనసూయ గిరుక్కున లొపలికి వెళ్ళింది.
అప్పారావుకి, నాలాగే, తెలుగులో గొప్ప
పండితుడిని, అని అనుకుంటూ ఉంటాడు
మంచి " శ్లేష " వేసాననుకొని, నవ్వుకుంటూ ఇంటికి వచ్చాడు .
కానీ కథ ఇంకోలాగ అయింది. ఒక గంట
తరువాత , ఆ ఊరి మోతుబరి మదనయ్య ,వచ్చాడు . వస్తూనే అప్పారావు చేతులు పుచ్చుకొని, "బాబ్బాబు ఈ విషయం ఎక్కడ చెప్పకు .
ఏదో పొరపాటైంది . నలుగురికి తెలిస్తే బాగోదు, కావాలంటే ఈ డబ్బు వుంచు,"
అంటూ బలవంతంగా కొన్ని నోట్లు జేబులో
కుక్కి, వెళ్లి పోయాడు" .
విషయమేమిటంటే , అనసూయ , మదనయ్య ఇలాకా . ఎవరికి తెలియకుండా గుట్టుగా వ్యవహారం నడిచేది . ఏదో పొరపాటున అనసూయ
నెల తప్పింది. నలుగురికి తెలిస్తే బాగోదని
అనసూయ , పిన్నికో, అత్తకో బాలేదని
పట్నం పంపాడు . అక్కడ గుట్టుగా ఉంచి
తెలిసిన హాస్పిటల్లో డెలివరీ చేయించాడు
పుట్టిన బిడ్డను ఎవరికో అప్పచెప్పి ,
అనసూయను తిరిగి ఇంటికి చేర్చాడు .
ఈ విషయమంతా, అప్పారావుకి, తెలిసిందని, మదనయ్య భయపడి , డబ్బులిచ్చాడు".
అదిరా, సంగతిని , సుబ్బారావుకి చెప్పాడు . కథ, ఇక్కడిటితో అయిపోతే పెద్దగా మజావుండదు .
కొన్ని రోజుల తరువాత , ఎవో రెండు రోజులు సెలవులొస్తే, సుబ్బారావు, వాళ్ళ
ఉరికి వెళ్ళాడు. బస్సు దిగి వీధేమ్మటే
పోతుంటే, అప్పుడే ఇంట్లోంచి బయటకు
వచ్చింది , శేషమ్మ . సుబ్బారావుని, చూసి , "ఏరా ఎప్పుడు రావటం ?", అని అడిగింది. సుబ్బారావుని.
టక్కున, అప్పారావు " జోక్ " గుర్తుకొచ్చింది. వెంటనే , "నువ్వు
కన్నప్పుడే " అన్నాడు.
ఇక శేషమ్మ తగులుకుంది , "ఏరా త్రాష్టుడా
మొగుడు చచ్చి ముప్పై ఏళ్లయ్యింది,
కాటికి కాళ్ళు చాపుకున్నాను , నేను
కనటమేమిటిరా? , అంట్ల వెధవ , నీ శ్రాద్ధం
పెట్ట, నీ పిండం చెట్టు కింద పెట్టా!"
ఇంకా శేషమ్మ నోట్లోనుంచి వచ్చిన తిట్లు. .తూట్లు
పొడుస్తున్నాయిసుబ్బారావు ని.అతనిపరిస్థితి ఎట్లా
ఉంటుందో వూహి కోవచ్చు !!
బొమ్మ-బొరుసు..!!>మనోహర్ పంత్>భీమారం(హన్మకొండ )*
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి