ప్రద్యుమ్న :-వారాల ఆనంద్

పెన్సిళ్ళూ, క్రేయాన్సూ 
తెల్ల కాగితాలూ ముందేసుకు కూర్చున్నాడు 

ఏవో ఏవేవో గీతలూ రంగులూ 
పులుముతూ సంతోషంగా 
కాగితాన్ని తీర్చి దిద్దుతున్నాడు 

అరే పిచ్చి గీతల తో 
ఏమి ఆట అంటోంది వాడి అమ్మమ్మ 

నేనేమో 
మెరుపులు నిండిన వాడి కళ్ళనీ 
నవ్వుతున్న వాడి ముఖాన్నీ 
రంగులు పరిచిన కాగితాన్నీ 
మార్చి మార్చి చూస్తున్నా 

నన్ను నేనూ, నా బాల్యాన్నీ 
మళ్ళీ మళ్ళీ దర్శిస్తున్నా 

కామెంట్‌లు