*తేటగీతిమాలిక*:-బెజుగాం శ్రీజట్రిపుల్ ఐటీ బాసరగుఱ్ఱాలగొంది జిల్లా సిద్ధిపేట

 అలమటించిరి పిల్లలు నాకలేయ
పక్కనకనిపించగబువ్వ పరుగుదీసి
పాలుపంచియుతినుచుండె పాపలచట
ఆస్తిపాస్తులులేకనె యాశదీర
పేదవారికి కష్టాలు బాధతోడ
తప్పబోవెపుడుభువిలో తిప్పలవియు
ధనముయున్నవారలెపుడు దయనుతలచి
వారినాదుకోగలగాలి వరములాగ.

కామెంట్‌లు