జీవనరాగం ..!!ఆన్షి లు ...:--.డా .కె .ఎల్ .వి.ప్రసాద్ >హన్మకొండ .
రాజకీయం అయినా రక్తసంబంధం అయినా 
కుటుంబ వ్యవస్థ అయినా కుల వ్యవస్థ అయినా 
కలసివుంటేనే కదా కలదుసుఖం ఎవరికయినా 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ...!!

రాజకీయ కుటుంబాలు అధికార మదముతో
రచ్చరచ్చ చేసుకుని రోడ్డెక్కుదురు సిగ్గువదలి ,
స్వలాభ కీచులాటలు అభివృద్ది నిరోధకాలు 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ....!!

కులము ఒకటేగాని వర్గములు వేరు కావచ్చును
హెచ్చుతగ్గుల స్థాయి శత్రుత్వమును పెంచును !
ఆధిపత్యకులమువాడు మంటపెట్టును వీరిమధ్య 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ...!!

స్వార్ధమున్నచోట బంధుత్వము సరిరాదు లే ...
పేరాశగలవాడు మానవీయతకు దూరము లే ..
అధికారకాంక్షలే సర్వ జాడ్యములకు మూలము 
వినుము కె ఎల్వీ మాట నిజము సుమ్ము ....!!

ప్రాంతాల పేరుతో అన్నదమ్ముల మద్య చిచ్చు 
భాషావిభేదాలతో రాష్ట్రాల రాజకీయ రొచ్చు ..
వింతవింత విభేదాలతో విడిపోదురు ముర్ఖ ఙనం 
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ....!!

రకరకాల విభేదాలకు రాజకీయపు రంగుపూసి 
రాక్షస క్రీడలతో రక్తపాతం సృష్టింతురు కొందరు 
సుఖములేని బ్రతుకు ఏమి సాధించునో కదా ..
వినుము కెఎల్వీ మాట నిజము సుమ్ము ...!!కామెంట్‌లు
Shyam Kumar chagal చెప్పారు…
పొలిటికల్ satire బావుంది . జీవిత సత్యాన్ని కూడా అందులో నే వివరించారు. ఒకే సారి ఇన్ని విభిన్నమైన ఆలోచన లు ఎలా వస్తాయి. Dr klv చెప్పాలి