వేగ రార కృష్ణ వేణు లోల
లాల బోసి నీకు లావణ్య మొలికించు
మోము దిద్దగాను మోద మయ్య!
కురులు దువ్వి చుట్టి కూరిమి శిఖిపింఛ
మలర గాను నెంత వెలుగు ముఖము
కనుల పండు గౌను కస్తూరి నామమ్ము
కదల కుండు కృష్ణ కాటుకిడుదు !
చిన్ని పాదములవి చిరు చిరు మువ్వలు
ఘల్లు ఘల్లు మనుచు ఘనము సడియు
నీల మేఘ శ్యామ నిన్ను వీడగలేను
మమ్ము బ్రోవ రార మహిమ జూప!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి