సమస్యాపూరణం:-డా.ఎన్.వి.ఎన్.చారి> సమస్యాపూరణం పద్య కవి >హన్మకొండ *

 *సమస్య -“మదనుని కంటి మంటలకు మాడెఁ
---------------------------------------------------------------
 ద్రినేత్రుఁడు చిత్రమయ్యెడిన్”*
----------------------------------------
పూరణ*
-------------
హృదయమునందు ప్రేమజనియింపగ జేసి మహేశునీశ్వరిన్
ముదమున జేర్చుయత్నమున మూడవ కంటిని జూడ నీశుడున్
మదనుని, కంటి మంటలకు మాడెఁ!  ద్రినే త్రుఁడు చిత్రమయ్యెడిన్
అదనున పార్వతమ్మ ప్రణయాగ్ని ప్రకాశ మునందు వెల్గగా.

కామెంట్‌లు