కుళ్ళు మనిషి: - వై . అనురాధ రాజేశ్వర రెడ్డి

  ప్రక్కన 
ఆ అంటే 
ఎస్ హుజూర్ 
అనే రెండు తోకలను పెట్టుకొని
 గురువింద గింజ
 కింద ఉన్న నలుపును చూసుకోక
 మీద ఉన్న ఎరుపుతో ఎగసి ఎగసి పడినట్లు
 కుళ్లు కుతంత్రాలతో నిండి
 మనసులో పగ ద్వేషం పెంచుకుని
 ఎప్పుడు ఎదుటి వారి తప్పులను పసిగడుతూ
 వారిని తక్కువ చేయుటకు చూస్తూ
 వారి గురించి
 ఆడవారితో మగవారితో ముచ్చట్లు పెడుతూ
 ముసిముసి నవ్వులు నవ్వుతూ
 కడుపున కత్తులు నోటిలో బెల్లంగా మాట్లాడుతూ
 మంచి వారమనే ముసుగేసుకొని
 ఒకరి మీద ఒకరికి చెపుతూ
 తిరుగుతూ ఉంటే
 నీవు మంచివానివవుతావా
 మంచి వాడిని అనగానే లోకం నమ్ముతుందా
నీ  నిజస్వరూపం ఏంటో
 నీ మనసుకు తెలియదా
 ఆ భగవంతుడు చూస్తలేడా
 సమయం వచ్చినప్పుడు
 తగిన మూల్యం తప్పక చెల్లించి తీరాలి 
అప్పుడు నీవు ఒంటరి 
నిన్ను చూసి అందరూ ఛీదరించుకునేవారే 
అప్పుడు చేసిన తప్పులు గుర్తుకు వస్తే ఏం లాభం
 ఎవడు చేసిన తప్పు వాడు అనుభవించి తీరాలి 
ఇది దైవ నిర్ణయం
 ఇంతకుముందు 
ఏడు తరాల వారికి మన పాపం వెళ్లేదట
 కానీ
 ఇది కలియుగం
 ఇప్పుడు
 ఈ జన్మలోనే
 చేసినవారికి వెంటనే తగులుతుంది
 తస్మాత్ జాగ్రత్త 
//మనిషి మేలుకో///తప్పును వెంటనే సరిదిద్దుకో//
కామెంట్‌లు