రెండు నాలుకల పాము (కవిత )-యెల్లు .అనురాధ రాజేశ్వర్ రెడ్డి-- తెలుగుభాషోపాధ్యాయులు-- జడ్.పి.హెచ్.ఎస్ కుకునూరుపల్లి

 దొంగతనము చేసినవాడే 
దొంగ దొంగ అని అరిచినట్లు 
ఇజ్జత్ తీసిన వాడే
 ఇజ్జత్ పోవద్దు
 ఇజ్జత్ పాయే
 అని అరవడం
 విలువ తీసుకుంటూ
ఇప్పటివరకు 
పోయిన విలువ కాపాడుదాం
 అని అనడం
  ఎంత విడ్డూరం 
వీడికి రెండు నాలుకలున్నాయా
 పక్కన కూర్చొని
 ముచ్చట్లు పెట్టి 
వ్యక్తి జీవితం
 నాశనం చేసినోడే 
ఇంకెవరో చేసినారు 
అని ముసలి కన్నీరు కార్చడం
 బాగైంది 
 అని లోపల ఉంచుకుని
 బాధపడినట్లు 
నటించడం 
ఎక్కువ మందితో 
గొడవలు పడిన వాడే
 ఎక్కువ మందిని 
ఇబ్బంది పెట్టిన వాడే
 ఇతరులను ఇబ్బంది పెడితే
 పాపం తగులుతుంది
 అని అనడం 
ప్రతి పనిలో
 అడ్డుపుల్లలు వేస్తూ
 సుండు మూతి 
ముచ్చట్లుపెడుతూ
 పిల్లలను 
పెద్ద వారిని ఉసిగొల్పి
 ఆ పని జరగకుండా చేసే వాడే
 అయ్యో పని జరగలేదే
 అని ఆశ్చర్య పోవడం
 విచారిస్తున్నట్లు నటించడం
 అర్హత లేకపోయినా
 ఉన్నత స్థానం గురించి 
ఎగబాకడం
 అన్ని పనులలో 
అందరి విషయంలో 
తలదూర్చడం 
ఇంట్లో వారే  మన మాట వినరు
 బయట ఆడవారిపై 
మగవారిపై 
పెత్తనం చేయడం 
ఆడవారి ముందు వినయంగా మాట్లాడి 
వారిని ఉసిగొల్పి
 వెనుక వారి గురించి 
చండాలపు ముచ్చట్లు పెట్టడం
 మగవారిని తన మాటల ప్రభావంలో 
మభ్య పెట్టడం
 అందరూ జై హుజూర్
అనే విధంగా చేసుకోవడం 
ఎంత విడ్డూరం కలికాలం 
వీడికి రెండు నాలుకలు ఉన్నాయా
 200 నాలుకలు ఉన్నాయా
 వీరివల్లలో పడేవారికి మెదడుందా లేదా 
వీడి ముచ్చట్లు వినేవారికి సోయి ఉందా లేదా 
వీడి మాటలు వినేవారు మనుషులా ఆదిమానవులా
 ఒకసారి  మీరే ఆలోచించండి 
ఏది మంచి ఏది చెడు 
ఎవరు మంచి ఎవరు చెడు 
తస్మాన్ జాగ్రత్త


కామెంట్‌లు