ముడివేసింది స్నేహమనే బంధంతో
అది మొదలు ఇరువురొకటైనారు
చూడచక్కని తెలుగు సున్నితంబు
వేరుపరచలేనంతగా బంధం ముడివేసుకుని
ఒకరికొకరని ఇరువురొకటే అన్నట్లు
కులమత వర్గవైషమ్యాలు తెలియకనే
చూడచక్కని తెలుగు సున్నితంబు
ప్రాణంలో ప్రాణంలా బ్రతుకుతారు
ఆపదలో గురుతొచ్చే తొలిబంధం
జీవితాంతం తోడుండే నిస్వార్ధత
చూడచక్కని తెలుగు సున్నితంబు
ఆవేదనలో ఆనందంలో అన్నింటా
కష్టమైనా నష్టమైనా తోడైయ్యుండి
వెన్నుదన్నుగా ప్రోత్సాహమిస్తూ ముందడుగేయించును
చూడచక్కని తెలుగు సున్నితంబు
మన ఎదుగుదలకి ఆనందించేది
మరింత ఉన్నతంగా నిలిపేది
బంధాలన్నింటిలో మిన్నైనది స్నేహమే
చూడచక్కని తెలుగు సున్నితంబు


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి