మన దేశ చరిత్ర లో మరుగున పడిన నిజాలు!? అచ్యుతుని రాజ్యశ్రీ

 ముస్లిం పాలనలోనే కాదు ఆంగ్లేయులకాలంలో కూడా మనదేశం  పడరానిపాట్లుపడింది.హిందువుల పై అత్యాచారాలు నేటి తాలిబాన్లకి తాతలు!కానీ ఆసత్యాలు దాచింది కూడా మనం !అవి పాఠాలుగా పెడితే కానీ  మనకి అవగతంకాదు.ఆకాలంలో త్రిపుర మణిపుర్ రాజ్యాలు బలిపశువులైనాయి.మణిపుర్ కి ఉత్తరాన నాగాకొండల్లో నాగాజాతివారున్నారు. మణిపూర్ నాగాలమధ్య యుద్ధాలు జరుగుతుండేవి.
ఒక్కోసారి  ఒక్కోరికి విజయము లభించేది. 18వ శతాబ్దం  మధ్య కాలంనించి ఆంగ్లేయులకి మణిపుర్ తో  సంబంధబాంధవ్యాలుండేవి.
పైగా మనదేశం లో రాజులు పాలకులు అంత:కలహాలు కొట్లాటలు కుమ్ములాటలతో మునిగి తేలుతూ  పరాయివారి పొందుకై పరితపించేవారు. తిన్న ఇంటికేవాసాలు లెక్కపెట్టేవారు.కోపంతో పరాయిఇంటికి నిప్పు పెడితే మన ఇల్లు కూడా తగలబడుతుంది అనే ఇంగితం లేనివారు.ఆనాటి ముస్లిం పాలకుల ఆగడాలు భరించలేక కూచ్ బీహార్  గౌహతి మొదలైన హిందూ రాజ్యాలపాలకులు ఆంగ్లేయులను శరణువేడారు.మణిపూర్ రాజు  శరణువేడి ఆంగ్లేయులచేత మొట్టికాయలు తిన్నాడు.
తూర్పు బెంగాల్ లో ముస్లింలు దాదాపు 700ఏళ్ళు పాలించారు. మణిపూర్ పాలకులు వారిని ముప్పు తిప్పలు పెట్టారు. 1760లోమహారాజా జయసింహ  మణిపూర్ సింహాసనం ఎక్కాడు. బర్మాతో వైరం కొనసాగటంతో ఆంగ్లేయుల సాయం కోరాడు. సరే నని పుర్రచెయ్యి చూపారు తెల్లదొరలు.విక్టోరియా రాణి కాలంలో మణిపూర్ రాజైన గంభీర్ సింహ్  ఆంగ్లేయులతో సన్నిహితంగా ఉన్నాడు.బర్మాను ఓడించి స్వతంత్ర రాజ్యంగా మార్చాడు.కానీ ఆంగ్లేయులు పిట్టల పోరు పిల్లి తీర్చినబుద్ధి కలవారు.బర్మా తో వేరే ఒప్పందం కుదుర్చుకుని మణిపూర్ ని గుప్పిట్లో బిగించారు. గంభీర్ సింహ్  చనిపోటంతో అతని తమ్ముడు దేవేంద్ర సింహ్  వదిన ఆమె కొడుకు 13ఏళ్ళ చంద్రకీర్తి సింహ్ ని వెళ్లగొట్టి తనే గద్దె ఎక్కాడు. 19ఏళ్ళ వయసులో  చంద్రకీర్తి మణిపూర్ తిరిగి వచ్చి గద్దె నెక్కి ప్రజారంజకంగా పాలించాడు.ఆసుపత్రి  పోస్ట్ ఆఫీసు  టెలిగ్రామ్ ఆఫీసులను నెలకొల్పాడు.
ఇప్పటికైనా  ఈ చారిత్రక నిజాలు తెలుసుకుని  మనలో మనం కలహించుకునే వాటికి స్వస్తి పలికితే మన దేశం  అభివృద్ధి పధం లో చకచక పరుగులు తీస్తుంది. లేకుంటే  చరిత్ర  మళ్లీ  రిపీట్ అవుతుంది. పిల్లలకి ఇవన్నీ చెప్పితేనే నేటి  వజ్రోత్సవాలకి సార్ధకత!
కామెంట్‌లు
శ్యామ్ కుమార్ chagal. నిజామాబాద్ చెప్పారు…
Excellent. Nice.