*ద్విత్వాక్షర గేయాలు**ప-ప్ప ఒత్తు పరిచయం*:- *వురిమళ్ల సునంద, ఖమ్మం*

 తప్పులు చేయకురా చిన్నా
గొప్పలు చెప్పుకోవద్దుర కన్నా
చెప్పుడు మాటలు డప్పు వేసుకుని
ఊరంతా చెప్పేవారికి ఎప్పుడూ
దూరం ఉండు మరువకెప్పుడూ
ఉప్పు తిని ఉపకారం మరిచి
కప్పల వలె బెకబెకలాడే వారితో
ఎప్పటికైనా ముప్పు తప్పదు సుమా

కామెంట్‌లు