*వనమహోత్సవం-విశ్వవికాసం*("రాజశ్రీ"కవితా ప్రక్రియలో)(తొమ్మిదవభాగము):-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 33)
అశోకుని పాలనలో శిక్షణ
అరణ్యాన వనజీవ రక్షణ
మౌర్యవంశ చంద్రగుప్త భూపతి
మహాటవుల పెంచెననెడి కీరితి!
(కీరితి=కీర్తి)
34)
సంప్రదాయ సంస్కృతి వినాశము
సంక్రమించె తరువుల నాశము
వన సంతతి తరిగిపోయె
ఇక దుర్భిక్షము పెరిగిపోయె!
35)
జనము పెరుగ వనమునశించెను
స్వార్థ దాహమె జనులకుమించెను
వనముల నాశము జూచెను
భూమాత కంటినీరు గార్చెను!
36)
సప్త సంతానములో ఉన్నది
వృక్షము పెంచుట అన్నది
వనమన్నది మనసుఖ జీవనముకొరకే
మానవ ఆకాంక్షల మేరకే!
(సశేషము)

కామెంట్‌లు