ఆరోగ్యం(బాలలగేయం):-డి.కె.చదువులబాబు.తెలుగుఉపాధ్యాయుడు.ప్రొద్దుటూరు.కడపజిల్లా.

 అరటిపండు తిందామా
అమ్మ ప్రేమలా
నల్లద్రాక్ష తిందామా
నాన్న ప్రేమలా 
జామపండు తిందామా
జేజి ప్రేమలా
బత్తాయిపండు తిందామా
తాత ప్రేమలా
మామిడిపండు తిందామా
మామ ప్రేమలా
ఆఫిల్ పండు తిందామా
అత్త ప్రేమలా
బొప్పాయిపండు తిందామా
భలేభలేగా
దొరికినపండు తిందామా
దోరదోరగా
ఆరోగ్యంగా ఉందామా 
 హాయిహాయిగా!!

కామెంట్‌లు