"కా" గుణింత గేయం:---మచ్చ అనురాధ-తెలుగు భాషోపాధ్యాయురాలు-జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 కమలా-విమలా రారండి
కాలం వృధా చేయొద్దూ
కిటుకు చూపక వినరండి
కీలక విషయాలు చెప్పేదను
కుదురుగా మీరు కూర్చోండి
కూలి పనులకు వెళ్ళొద్దు
కృషితో విద్యను నేర్వాలి
కౄర తత్త్వము  వీడాలి
కెరటములా  విజయ,
కేతనము ఎగరేయాలి
కైవస మొందును జ్ఞానము
కొలువుదీరిన దేవుడిలా
కోరి  మ్రొక్కేరు అందరు
కౌముది వెలుగులు పంచు
కంటి వెలుగువై  జీవించు .

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగుంది