చీమలంటే చిన్నచూపు తగదు!!;-- యామిజాల జగదీశ్

 మనమందరం చీమలను ఎక్కడో అక్కడ చూస్తూనే ఉంటాం. అవి కుట్టినప్పుడు వాటి మీద కోపం పొంగుకొస్తుంది. చిరాకేస్తుంది.
చీమలు ఎంత ఆశ్చర్యకరమైనవో అని ఎవరైనా ఎప్పుడైనా ఆలోచించేరా....నేనైతే ఆలోచించలేదు. తమిళ కవి వైరముత్తు చీమలమీద ఓ దీర్ఘ కవిత రాయడం చదివినప్పుడు వాటి గురించి తెలుసుకోవాలనే ఆరాటం కలిగింది.
ఈ ప్రపంచంలో ఎన్ని చీమలున్నాయో
మనమెప్పుడైనా ఆలోచించేమా?
చీమ బరువు... చీమ బలం.... చీమ శ్వాస...
చీమ చెవులు..... చీమ జనాభా..... చీమ సంతతి పెంచుకోవడం... రైతు.... రెండు పొట్టలు.... ఈతకొట్టే చీమలు.... చీమల జీవితకాలం.... చీమల పుట్ట...
ఇలా ఎన్నో విషయాలున్నాయి తెలుసు కోవడానికి....
చీమలు భూమిని గుల్లగా చేసి పుట్టలు కడుతుంటాయి. 
ఐకమత్యం అనగానే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి చీమలే. 
పుట్టలో కలిసి ఉండడమే కాక, వాటి పని సక్రమంగా చేసుకోవడంలోనూ క్రమశిక్షణ పాటిస్తాయి. కందిరీగల నుంచీ పుట్టుకొచ్చిన చీమలు సుమారు 10 కోట్ల సంవత్సరాల క్రితం కందిరీగల నుంచి విడిపోయి, ప్రత్యేకమైన పురుగులుగా రూపొందాయి.
చీమలలో పదకొండు వేలకుపైగా  జాతులు న్నాయి.
ప్రపంచంలో మొత్తం చీమలను కలిపితే వాటి బరువు, మనుషుల బరువు కన్నా ఎక్కువ ఉంటుంది.
జార్ఖండ్‌ రాష్ట్రంలో ఆదిమానవుల తెగైన కోడా జాతివారు చీమలను తింటారు. ఎర్ర చీమలను సైతం వారు లాగించేస్తారు. ఎర్ర చీమలు తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లలకు కూడా చెబుతారు
చీమలు తమ బరువు కన్నా పది నుంచి యాభై రెట్ల బరువులను మోసూకుపో గలవు.
 
ఆసియా నేత చీమలు అనే రకపు చీమలు తమ బరువు కన్నా వంద రెట్ల ఎక్కువ బరువును ఒక చోటు నుంచి మరొక చోటుకి తరలించగలవు.
చీమల చిన్నపాటి శరీర ఏర్పాటే వాటి పటుత్వానికి కారణం.
చీమల దేహాన శ్వాస ప్రక్రియ ఏర్పాటు లేదు. దీనికి బదులు దేహం చుట్టూ ఆక్సిజన్ ని తీసుకుపోగలిగేందుకు తోడ్పడే శ్వాస మార్గాలున్నాయి.
చీమలు తమలో ఏర్పాటై ఉన్న రంధ్రాలతో శ్వాసిస్తాయి. ఈ రంధ్రాలు సీజన్ కు తగినట్లు ఉపయోగించుకుంటాయి 
చీమలకు చెవులు లేవు.
అలాగని చీమలకు వినికిడి శక్తి లేదని  చెప్పడానికి వీల్లేదు. చీమలు భూప్రకంపనలను బట్టీ వస్తువులేమిటో తెలుసుకుంటాయి. వాటి మోకాలు కిం
ద ఉన్న రంధ్రాలుఈ ప్రకంపనలను పసిగడతాయి.
చెవులే లేని చీమలు మన చెవులలోకి ఎలా పోతే మన పరిస్థితి ఏమిటి? అవి ఏనుగు చెవులలోకి పోతే....?!
ప్రపంచంలో మొత్తం చీమలెన్నో ఎవరూ లెక్కించలేకపోయారు.
అంటార్కిటికా, ఆర్కిటిక్ వంటి కొన్ని ఖండాలలో మినహా మిగిలిన ప్రపంచమంతటా చీమలున్నాయి.
చీమల మధ్య ఘర్షణ తలెత్తితే ఏదో ఒక చీమ చనిపోయేదాకా కొనసాగుతుంది పోరు.
కొన్ని చీమలకు మగతోడు అవసరం కలగవు. అవి తానుగానే సంతతిని పెంచుకుంటాయి. అవి క్లోనింగ్ పద్ధతిన సంతతిని పెంచుకుంటాయి.
చీమలు తమకవసరాలకు తామే సాగు చేస్తాయి. మనిషి నాటి పంటలు సాగు చేయడం మొదలుపెట్టడానికి ముందే చీమలు సాగు చేపట్టాయని పరిశోధకుల మాట.
చీమలకు రెండు పొట్టలుంటాయి. వాటిలో ఒక దాంట్లో తమకవసరమైన ఆహారాన్ని నిల్వ ఉంచుకుంటాయి. మరొక దానిలో ఇతర కొన్ని చీమలకోసం కొంత ఆహారాన్ని సేకరించి దాస్తాయి.
కొన్ని చీమల తెగలు ఈతకోట్టగలవు. వాటికి నీటిపైన తేలియాడగల శక్తి ఉంటుంది.
"నిప్పు చీమ"లని పిలువబడే చీమలు పడవలాటివి తయారు చేస్తాయి. అవి తమకు అనవసరమైనవాటిని నాశనం చేసి మనిషికి నష్టం కలిగిస్తాయి.
రాణి చీమలనబడేవి గుడ్లు పెడతాయి.
ఇతర చీమలు పనులు చేస్తాయి.
సాధారణ చీమల జీవితకాలం దాదాపు తొంబై రోజులని బ్రిటన్లో జరిగిన అధ్యయనంవల్ల తేలింది. 
కానీ నల్ల చీమలలో ఆడవి పదిహేనేళ్ళ వరకూ బతుకుతాయని తెలియవచ్చింది.
చీమలు గుంపులుగా బతుకుతుండటం వల్ల వాటినీ ఓ కాలనీగా ఇంగ్లీషులో చెప్తారు. మనం తెలుగులో చీమల పుట్ట అని అంటాం. తమిళంలో పుట్రు అంటారు. చీమలు ఆహారం దాచడానికి, సంతతి పెంచుకోవడానికి ఇటువంటి పుట్టలను ఉపయోగించుకుంటాయి.
2002లో ఆరు వేల కిలోమీటర్ల పొడవైన చీమల పుట్టను కనుగొన్నారని చరిత్ర పుటలు తిరగేస్తే తెలిసింది. ఇది ఇటలీ నుంచి స్పెయిన్ ఎల్లల వరకూ వ్యాపించిందట.
చీమలను చూసి చురుకుతనాన్ని నేర్చుకోమంటారు పెద్దవాళ్ళు. అంతేకాదు, చీమల నుంచి ఐకమత్యాన్నికూడా తెలుసుకోమంటారు.
మన ప్రపంచంలో పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి, దేవుడు అన్ని జీవులకు కొన్ని ప్రధాన బాధ్యతలను ఇచ్చాడు. వాటిలో చీమ కూడా ఒకటి.
చీమలు ఎప్పుడూ ఒక వరుసలో నడవటం మనమందరం చూసే ఉంటాం. 
చీమలలో మగ చీమలకు రెక్కలు ఉంటాయి. ఆడ చీమలకు ఉండవు.
చీమలకు కళ్ళు ఉంటాయనేది చాలామందికి తెలియని విషయం.
ఈ చీమలు ఆహారం వెతుక్కుంటూ బయటకు వెళ్ళినప్పుడు, రాణి చీమ దారిలో ఫేర్మోన్స్ అనే రసాయనాన్ని వదులుతుంది. ఇతర చీమలు ఆ రసాయనం వాసన ఆధారంగా అదే బాటలో వెళ్తాయి. చీమలు ఒక వరుసలో నడవడానికి ఇదే కారణం. 

ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చీమలు బ్రెజిల్‌లోని అమెజాన్ అడవుల్లో కనిపిస్తాయి.
రాణి చీమ జీవితకాలం 30 సంవత్సరాలు.
చీమకున్న నానార్థాలు... పిపీలక, పిపీలకం!!
చీమలలో ఎర్రచీమ, కొండచీమ, గండుచీమ, చలిచీమ, నల్లచీమ, రెక్కలచీమ అందరికీ తెలిసినవే.
చీమ రక్తానికి రంగు ఉండదు.
చీమల కోరలకున్న బలం అంతా ఇంతా కాదు.
చీమల పుట్ట, వర్షాకాలంలో నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకుంటుంది. ఒక్కో పుట్టలో 80 లక్షల దాకా నివసిస్తాయి. రాణి చీమలు, శ్రామిక చీమలు, సైనిక చీమలు, కాపలా చీమలు. 
మగ చీమలు రాణి చీమలతో జత కలిశాక వెంటనే చనిపోతాయి. 
రాణి చీమలకు సేవలు చేసేవేమో శ్రామిక చీమలు. ఇవి రాణి చీమ శరీరం నుంచి వచ్చే రసాయనాన్ని రుచి చూసి, దాని ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకుంటాయి. 
చీమలు తమ స్థావరాన్ని దారిలో ఉన్న కొండ గుర్తులతో పాటు సూర్యుడి దిశను గుర్తుపెట్టుకొని కనిపెట్టి సాగిపోతుంటాయి.
ఇలా బోలెడంత చెప్పుకుపోవచ్చు చీమల గురించి.
కానీ ఎక్కడో అక్కడ పులుస్టాప్ పెట్టాలనుకుని ఇంతటితో ఆపాను.

కామెంట్‌లు
Shyam Kumar chagal చెప్పారు…
Good info subject tq