అంతర్జాల వేదికగా "అరుణోదయసాహితీ వేదిక అనుబంధ సంస్థల కవి, గాయక సమావేశం.
 పాతసంవత్సరానికి "2025" కు  వీడ్కోలు 
కొత్త సంవత్సరానికి "2026"  స్వాగతం
💐🌹💐🌹💐🌹💐🌹
  అంతర్జాల వేదిక ఆధారంగా  మంగళవారం  పాత సంవత్సరం 2025  కు  వీడ్కోలు పలుకుతూ, కొత్త సంవత్సరం 2026 కు స్వాగతం  పలుకుతూ "అరుణోదయ సాహితీ వేదిక (వాట్సాప్, ఫేస్బుక్ )  అనుబంధ సంస్థలు అయిన కవి గాయక సమ్మేళనం దిగ్విజయం గాజరిగింది.ఈ సమావేశం ముందుగా సమూహంలోని  వారికీ,సమూహా లకు భగవంతుని దయ చల్లగా  ఉండాలని సమూహ వ్యవస్థాపకురాకురాలు  అయ్యల సోమయాజు ల అశ్విర్వచనా లు పలుకమని కోరడంతో  వారి  అశ్విర్వచన  వేదమంత్రాలతో మొదలై, ఝాన్సీ ముడుంబై సరస్వతీ ప్రార్థనతో సాగిన  ఈ కార్యక్రమం లోసభను ప్రారంభిస్తూ తాను నడిపే సంస్థల కార్యక్రమాల గురించి వివరించి, సభా ధ్యక్షులు  రామకృష్ణ చంద్రమౌళి ని కార్యక్రమాన్ని నిర్వహించమని కోరారు.
 ముందుగా డా. అర్ధచంద్ర ప్రకాష్ రెడ్డి  సాహిత్యంపై  15 నిముషాలు ప్రసంగించారు.డా. జయరాములు  ఘంటామనోహర్ రెడ్డి,కృష్ణారడ్డి , డా. V. D. రాజగోపాల్ , డా. రంగరాజు పద్మజ   మొదలైన సాహితీ పెద్దలందరూ ఎంతో అమూల్యమైన  సందేశా లతో కవులను, సభలోని వారిని ఉద్దేశించి ప్రసంగించారు.సాహిత్యరంగానికి యువతరం రావాలని, వారి అవసరం ఎంతో ఉందని, సమాజములో ఆధునిక మార్పులు రావడానికి యువకవులదే బాధ్యత ఉoడాలనే సందేశాన్ని ఇచ్చారు.ఇలా నాలుగున్నర గంటలపాటు సాగిన  ఈ సమ్మేళనంలోకవులు, గాయని గాయకులు  ఎంతోమంది చేరి కవితలు, పాటలు  వినిపించారు.ప్రముఖ సాహిత్యవేత్త  C. నారాయణ స్వామి  కవిసమ్మేళనాన్ని తమదైన పద్దతిలోవిన్నూ తంగా నిర్వహించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
ఈకార్యక్రమంలో Gk సుబ్రహ్మణ్యం,, వనం మంజూభార్గవి, మంజులదేశ్ పాండే, మద్దిరాల రాం ప్రసాద్, చేకూరు శైలజ, డా. కే. ఉషారాణి, v. సత్యబాల, కట్టాశ్యామల, అనంతా త్ముల శ్రీనివాస్, శ్రీనివాస సాయి కోటి, బాలుసాని వనజ, వేదుల వినీంద్ర, ఒగిరాల గాయత్రి, పాటి బండ్ల కవిత, మాణిక్య లక్ష్మి, బుక్కపట్నం రమాదేవి, c.వివేక, డా. లక్ష్మి ఉపదృష్ట, v. మంజుల, p. ధనమ్మ, డా. N. నర్సింహ శర్మ, విక్టోరియా, లలితా చండీ ఇంకా  తదితర వారు  పాల్గొని కవితలు, పాటలు వినిపించి సభను  విజయవంతం చేసారు.
సమూహ అధ్యక్షు రాలుడా. అరుణ కోదాటి పేరు పేరునా అందరికీ  ధన్యవాదములు తెలిపింది.
బిట్టవరం శ్రీమన్నారాయణ  వందన సమర్పణ చేసి, సాంకేతిక సహకారం చేసారు.

కామెంట్‌లు