చిరునవ్వు తప్ప
ముఖమే లేని ఆమె
ముత్యాలు రాలుస్తుంది!!
వెలుగు తప్ప
నీడే లేని ఆమె
చీకటిని ప్రేమిస్తుంది!!
అడుగులు తప్ప
నడకే లేని యామే
గమ్యాన్ని దాటేస్తుంది!!
వాలేందుకు భుజాలే లేని
ఆమె తోడు కోసం
నిరీక్షిస్తుంది!!
జీవిత రంగస్థలంలో
చదరంగం రాని ఆమె
ఒంటరిగానే నటిస్తుంది!!
కుశల ప్రశ్నలకు సమాధానాలు లేని
ఆమె
భవిష్యత్తు బావిలో దూకేందుకు
సిద్ధమవుతుంది!!
యుద్ధమే తప్ప చేద్దామంటే
మంచి పనేలేని ఆమే
అద్దాన్ని పగలగొట్టింది!!
రూపం తప్ప అపురూపంగా
చూసుకునే కళ్ళు లేక ఆమె
వంటిని మట్టిగా మార్చుకుంది!!
ఆకాశంలో విరిసిన ఇంద్రధనస్సులా
భూమిపై విరిసింది ఆమేనని
తెలుసుకో లేక పోయింది లోకం!!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి