*పుస్తక పండుగ*--పెందోట వెంకటేశ్వర్లు
వచ్చింది వచ్చింది
పుస్తకాల పండుగ
పిల్లలను తీసుకుని
పెద్దల్లారా రారండి.

శతకాలెన్నో ఉన్నాయి
కథల వొయ్యిలున్నాయి
పాటలు , నాటిక,  గేయ ,
తీరొక్క పుస్తకా‌లున్నాయి

డిసెంబరొస్తే చాలండి
అక్షరాల దండలతో
పుస్తకాలు పరుగునొచ్చు
మస్తకాలో నిలిచేను.

కామెంట్‌లు