భగవంతుని మహిమ :-*" కవిశిరోమణి "**" రసస్రవంతి " 7075505464**" సాహితీ శిరోమణి "**" కావ్యసుధ " 9247313488*
ఓ మానవుడా  !
ఆకాశాన్ని నీ కనురెప్పల                    
 మాటున దాచుకుంటావా !
సముద్రాన్ని నీ అరచేతితో                                                      
 పట్టుకుంటావా  ?
గాలిని పిడికిట పెట్టుకుంటావా 
ఇసుకలో రాయవచ్చును, కానీ 
నీటిపై వ్రాతలు రాయగలరా ?
సృష్టికి ప్రతి సృష్టి చేసినా
మనిషికి ప్రాణం పోయే గలవా ?
నీవు సాధించలేనిది
నీ శక్తియుక్తులతో
నీటిని సృష్టించలేవు
గాలిని బంధించ లేవు 
ఇవన్నీ భగవంతునికి సాధ్యం

ఈ సృష్టి నాటకములో నీవు
పాత్రధారివే  !                    
నిన్ను నడిపించే సూత్రధారి
భగవంతుడే !! 
కామెంట్‌లు