శార్దూలము:
*ఆరావం బుదయించె తారకముగా | నాత్మాభ్రవీధిన్మహా*
*కారోంకార మకారయుక్తమగు నోం | కారాభిధానంబు చె* *న్నారు న్విశ్వమనంగ, తన్మహిమచే | నానాదబిందుల్సుఖ*
*శ్రీరంజిల్ల గడంగు, నీవదె సుమీ | శ్రీకాళహస్తీశ్వరా!*
తా.: శ్రీ - సాలెపురుగు, కాళము - పాము, హస్తి - ఏనుగు ఈ ముగ్గురు శివభక్తుల కలయికతో ఏర్పడిన శ్రీకాళహస్తి పట్టణము నందు వెలసిన పరమశివా.... ఈశ్వరా.....
తెలుగు అక్షరాలలో "అ", "ఉ", "మ" అక్షరాలు కలసి ఏర్పడిన "ఓం"కారమనే అక్షరము అది ఇక అందమైన శబ్దము. " ఓం" అక్షరము చేసేశబ్దము ఎంతో అందంగా, సంతోషాన్ని కలిగిస్తుంది. మనుషుల మనసుకు మంచి దారిని చూపిస్తుంది. మేము వున్న సంసార సముద్రాన్ని దాటడానికి పడవలాగా వుపయోగపడుతుంది. ఋషులు, మునులు ఈ "ఓం" కారము నువ్వే అని నమ్ముతున్నారు. ......అని శతక కారుడు ధూర్జటి వాక్కు.
*నిన్ను సరిగ్గా గుర్తు పట్టలేని వాళ్ళు కూడా "ఓం"కారాన్ని పట్టుకుని నిన్ను తెలుసుకుంటున్నారు. ఓం కారాన్ని మా మనసు అనే నావకు చుక్కానిగా చేసుకుని నిన్ను చేరుకుంటాము. మునులు యోగీంద్రులు కూడా నిన్ను "ఓం" కారముగానే అనుకుంటారు కదా. "ఓం" కార స్వరూపుడువి నీవే కదా. నన్ను నన్నుగా నీ దగ్గరకు చేర్చే పండంటి నావ "ఓం" కారమే.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి