"చ "గుణింత గేయం:-- కె.లహరి--9వ తరగతిజి.ప.ఉ‌పాఠశాల కుకునూర్ పల్లి.కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా. చకచక పిల్లలు రారండి
చాక్లెట్లు ఎన్నో ఇస్తాను
చిలక ల్లాగా మనమంతా
చీటికిమాటికి చిందులు వేస్తూ
చుక్ బుక్ చుక్ బుక్ అంటూ
చూసివస్తామా పూలతోటలు
"చృ " ఉచ్చారణ పలకండి
"చౄ" ను గమనించండి
చెంగుచెంగునామనమంతా
చేయి చేయి జతచేసి
చైను లాగా తిరుగుతూ
చొక్కాలు పట్టుకొని
చోద్యము ఎన్నో చూసేద్దాం
చౌదరి గారి తోట ఇది
చంద్రమువోలే ఉంది ఇది.

కామెంట్‌లు