"న" గుణింత గేయం:--: మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలు--జి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 నరక రాదు చెట్లనెవరు
నాటాలి మొక్కలెన్నో
నిత్యము పరిశీలించాలి
నీటిని తప్పక పోయాలి
నుడుగులు పలుకరాదు
నూతన విధానం యెరగాలి
నృపుడు శ్రద్ధ చూపాలి
నౄ అక్షరం  పలకండి
నెనరుగ కలిగి ఉండాలి
నేర్పు ఎంతో అవసరము
నైపుణ్యం నేర్వాలి
నొప్పింపరాదు పెద్దలను
నోరారా పలుకరించుము
నౌడు దాటిన మాటలు
నందము కలిగించవలెను.


కామెంట్‌లు