మహర్షి కార్వే...అచ్యుతుని రాజ్యశ్రీ

 భారతరత్న మహర్షి ధొండొ కేశవకార్వే 104ఏళ్లు జీవించి స్త్రీజన బాంధవునిగా పేరు గాంచాడు.18ఏప్రిల్1858లో రత్నగిరి జిల్లా లోని షెరోలీలో పుట్టాడు. తల్లి లక్ష్మీబాయి  తండ్రి కేశోపంత్.ముత్తాతల కాలంలో ధనధాన్యాలతో తులతూగిన ఆకుటుంబం కార్వే కాలానికి తిండి బట్ట లేక అల్లల్లాడింది.ఒకప్పుడు గుజరాత్ పాలకుడైన దామోజీ గైక్వాడ్ కిఆరున్నర లక్షలు అప్పు ఇచ్చిన వంశం అది.కార్వే కి ఒక అన్న  ఒక చెల్లి.ఒకసారి బరోడా మహారాజు చాలామంది కి ఆవులతో పాటు 10 రూపాయలు దక్షిణ ఇచ్చాడు.తల్లి  కొడుకులను హెచ్చరించింది "మనం మాడి మసి ఐనా సరే పైసా యాచించరాదు.దైవప్రార్థన తో కాలంగడుపుదాం".
కార్వే ఆరోజుల్లో 4వతరగతి పాస్ కాలేకపోయాడు.అది పాసైతే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ది.సోమన్ అనే మాష్టారు కార్వే చేత వార్తా పత్రికలు రోజు గుడిలో చదివిస్తూ సేవాదృక్పధాన్ని రగిల్చాడు.గ్రామం లోని వారిదగ్గర 5రూపాయలు తీసుకుని 800పెట్టుబడితో షాపు పెట్టిన ఆమాష్టారునెలకి 3రూపాయల జీతంతో కార్వే కి చేయూత నిచ్చారు.
ఆరోజులలో6వక్లాస్ పాసవుతే టీచర్ గా రాణించేవారు.150మైళ్లు కాలినడకన  వర్షాకాలం లో వెళ్లిన కార్వేని పరీక్షకు అనుమతి ఇవ్వలేదు. కారణం"నీకు17ఏళ్లులేవు."సతారా నించి  ఉసూరంటూ తిరిగివచ్చి  ఆపైఏడు 5వరాంక్ పొందాడు 2రూపాయల స్కాలర్షిప్ తో నెలకి 2అణాలకి ట్యూషన్ చెప్పాడు.లెక్కలులో డిగ్రీ పొందాడు. ఫండ్ ఏర్పాటు చేసి తన గ్రామం లో రోడ్డు బడి కి ఖర్చు పెట్టాడు.తెల్లారుఝామున 4కిలేచి పెరుగన్నం తిని గంట నడిచి 6కల్లా స్కూల్ లో ఉండేవాడు.15వ ఏటనే పెళ్ళి  భార్య పోయింది. అంత్యక్రియలు చేసి మరునాడు బడికి వెళ్ళాడు. 4గురు పిల్లలను తన ఇంట్లో పెట్టుకుని చదివించాడు.అందరిబలవంతంపై వితంతువు ఆనందీబాయిని పెళ్లాడి సంఘబహిష్కరణకు గురైనాడు.1900లో హిన్ గ్నేలో అనాధ వితంతు ఆశ్రమం ఏర్పాటుచేసి 4మైళ్ళు నడుస్తూ  వంట సరుకులు ఇచ్చేవాడు.ఆయనపై బోలెడన్ని నీలాపనిందలు. 1916లో ఇండియన్ ఉమెన్ యూనివర్సిటీ నెలకొల్పాడు.ప్రపంచమంతా తిరిగి ఐన్స్టీన్ ని కలిశాడు.మాతృభాష లో బోధన ఉండాలి అని ఆయన అభిప్రాయం. ఆయనను గూర్చి  చాలా  తక్కువ సమాచారం టైప్ చేశాను. ఆయన జీవితచరిత్ర అందరూ చదివి తీరాలి.
కామెంట్‌లు