అతడు కాలు మోపడం తోటే
ప్రాంగణంలోని అనువణువు అక్షరం అవుతుంది
అతని మాటల రెక్కల మీద
పిల్లలు అత్యంత సురక్షితంగా జ్ఞానవిహాయాసంలో
విహరించి వస్తారు
క్లాసులో ప్రవేశిస్తున్న ప్రతిసారి
అతని కుడి చేతికి "ఆరో వేలు" అదనంగా మొలుస్తుంది
అది ఖచ్చితంగా జ్ఞానం
ఘనీ భవించిన "సుద్ద ముక్కే"
ఉపాధ్యాయుడు పద్యం ఎత్తుకుంటే "గాన కచేరి"
పాఠం చెబుతుంటే "జ్ఞాన కచేరి" చెప్పి చెప్పి
అతని "ఊపిరితిత్తులు" ఉత్త ఉలిపిరి తిత్తులవుతున్న"
విద్యార్థులకు జ్ఞానజ్యోతులను
పంచుతాడు
ప్రతినిత్యం విశ్వరూప సందర్శన భాగ్యం కలిగిస్తాడు
గౌతమున్ని బుద్ధున్ని చేసినట్లు విద్యార్థులకు అతడొక
బోధి వృక్షం
బోధ వృక్షం"
అతని రాక విద్వత్ విద్యుత్ ప్రవాహం
తన దేహం నిలువెల్ల ముక్కలు ముక్కలుగా తెగి పడుతున్నా
తనువులోని అణువణువు క్షణక్షణం నేల రాలిపోతున్న ఆత్మబలిదానం తప్ప
అన్య మెరుగనిత్యాగశీలి
సుద్ద మొద్ధుల్ని
కూడా తీర్చిదిద్దే పరిశుద్ధమైన
సుద్ద ముక్క
పూవుకు తావి అబ్బినట్లు పిల్లలకు చదువు
సంస్కారాలు అబ్బినపుడు విద్య యొక్క సార్ధకత
పాఠాలతోపాటు జీవిత పాఠాలు నేర్పినపుడే
సార్ధకత భూమండలం మీద ఏకైక దర్శనీయ స్థలం బడి
ఉపాధ్యాయుని పాఠo ముగిసేసరికి గదంతా
విద్యా గంధమైన అనుభూతి విద్యార్థుల శిరస్సులు
విరబూసిన
తామెరలవుతాయి
చీకటి నుండి వెలుతురు వైపు
విద్యార్థులు మల్లుతారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి