*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 6, ప్రేమ!
    ఉరికే వాగు!
    ఎలా ఆగు?
    ఊరించే జాగు!
    ఉమ్మడి బాగు!
7. ప్రేమ!
     పోకడ పోకిరి!
     లయ లాహిరి!
     తిరిగే తింగరి!
     నడిచే నంగిరి!
8. ప్రేమ!
    అడుగు అందరిని!
    ఏమైనా ఇమ్మని!
    లోతైన మడుగు!
    మునకేయమని!
9.ప్రేమ!
   మనసున సహజం!
   వయసున ఆవేశం!
   వయసుడిగిన అభిమానం!
   జీవితాంతం సాహచర్యం!
10.ప్రేమ!
     పెంచక పెరుగునే?
     పంచిన తరుగునే?
     నిలిపిన నిలవదా?
     కలిసిన కదిలించదా?
       (కొనసాగింపు)

కామెంట్‌లు
Unknown చెప్పారు…
నేటి ప్రేమ లో మనో వాక్ కాయ కర్మ లను ఆవిష్కరించారు. శుభమస్తు .
Svr krishnarao చెప్పారు…
అనంతమైన ప్రేమ తత్వం మీదైన శైలిలో💐🙏