పచ్చి టొమాటో లో కూడా పోషక పదార్థాలు చాలా ఎక్కవగా ఉంటాయి. పచ్చి టొమాటో తో curry చేసుకొని తింటే చాలా బలవర్ధకం. ఇది cancer వ్యాధి రాకుండా కాపాడుతుంది. పేగులలో పుండుని అడ్డుకుంటుంది. Peptic ulcer కు మందు. అనారోగ్యం తరువాత పచ్చి టమాటో ను ఎదో ఒక రూపం లో తింటే త్వరగా కోలుకుంటారు.
ఇది ఎముకలకు కూడా అత్యంత బలాన్ని కలుగజేస్తుంది.
పచ్చి టొమాటో చట్నీ తయారీ విధానం....
మంచి తాజా పచ్చి టొ మాటోలను బాగా కడిగి ముక్కలుగాకోసి, కొన్ని ఎండు మిరపకాయలు, వేయించిన తెల్ల నువ్వులు మరియూ మినప్పప్పు, శెనగపప్పు, నువ్వుల నూనె లేక పల్లి నూనె లో జిలకర, ధనియాలు, మెంతులు వేసి, పోపు చేసి చింతపడు రసం, ఉప్పు తగినంత వేసి, మిక్సీ పట్టి చట్నీ తయారు చేసుకోవాలి. చివరలో తుంచిన కొత్తిమీరు వేసుకోవాలి.
చాలా రుచికరమైన, ఆరోగ్యకరమైన, చట్నీ తయారయింది. ఇది నెయ్యి వేసుకొని తింటే మరింత రుచిగా ఉంటుంది. ఇది నాలుకకు రుచిని పెంచుతుంది.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి