*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు

 51.ప్రేమ!
     గంధం చెక్క!
    అరుగుతున్నా సుగంధమే!
     కంటి రెప్ప!
     మూసిఉన్నా సుదర్శనమే!
52.ప్రేమ!
     పలాయనం తెలియదు!
     డోలాయమానం లేదు!
    కొలమానాలకు అందదు!
    అనురాగయానం!
              సుఖజీవనసారం!
53.ప్రేమ!
     ఆవిరి కానిది!
     ఊపిరి పోనిది!
     అలుపెరుగనిది!
     మరి,అదే గెలుస్తుంది!
54.ప్రేమ!
      బంధాలకు బంధం!
      అందాలకు అందం!
      ఆనందాల ప్రబంధం!
     అసలైన అనుబంధం!
55.ప్రేమ!
     విరిచేయడం తెలియనిది!
     జతచేయడమే తెలుసు!
     అదో అనంతమైన గొలుసు!
     "ప్రేమ ఖైదీ" మన మనసు!
              (కొనసాగింపు)

కామెంట్‌లు
రామానుజం.ప. చెప్పారు…
ప్రేమ .... అంతర్బహిర్వాహినియే !!