అమరావటి నగరంలో అటవీ శాఖాధికారిగా పనిచేసిన విశ్రాత అధికారి రాఘవయ్య తాతగారి ఇంటి అరుగుపైన ఆవాడకట్టులోని పిల్లలు అందరు చేరారు తాతయ్య చెప్పేకథ వినడానికి.
పిల్లలు అందరికి మిఠాయిలు పంచిన రాఘవయ్యతాత'బాలలు ప్రతి పండుకు ఒకరుచి ఉన్నట్లే ప్రతికథలోను ఒక నీతి ఉంటుంది. మీఅందరికి ఈరోజు సాటివారిని ఎలాఆదుకోవాలో తెలిపే కథ చెపుతాను అల్లరి చేయకుండావినండి....
తన ఇంటి అరుగుపై వర్షంలో తడుస్తూ వణుకుతునన్న బాటసారిని ఇంట్లో ఆశ్రయం కలిగించి పొడిబట్టలుఇచ్చి భోజనంపెట్టాడు సోమయ్య.
తెల్లవారుతూనే ఆవ్యక్తి''అయ్యా మీసహాయం మరువలేను ఆపదలో ఆదుకున్నారు సెలవు''అన్నాడు బాటసారి.
''మీరు ఎవరు?ఎక్కడికి వెళుతున్నారు''అన్నాడు సోమన్న.
' నాపేరు దానయ్య నేను అనాథను" అన్నాడు బాటసారి.
"నేను అనాథనే మీకు అభ్యంతరం లేకుంటే నాతోనే ఉండవచ్చు ఇద్దరం కలిసే కష్టపడి జీవిస్తూ, సాటివారికి సహయపడదాం"అన్నాడు సోమన్న.
మరుదినం అడవికి వెళ్ళిన ఇద్దరూ ఎండు కట్టేలు సేకరించి నగరంలో అమ్మి వచ్చిన ధనం పోదుపు చేయసాగారు.కొద్దిరోజుల అనంతరం తన ఇంటి వెనుక ఉన్న స్ధలంలో దానయ్యతో కలసి పెద్ద అనాథ ఆశ్రమం నిర్మించ సాగాడు సోమన్న.ఈవిషయం తెలుసుకున్న ఆ ఊరి ప్రజలు కొందరు ఆఇంటి నిర్మాణానికి తమవంతు వస్తువులు,ధనం,శ్రమదానం చేసారు.ఆశ్రమంలో పలులువురు నిరాదరణ పాలైన వారు వచ్చి చేరసాగారు.ఈవిషయం ఆదేశరాజు గారికితెలిసి సోమన్నా,దానయ్యలను సభకుపిలిపించాడు.రాజుగారికి నమస్కరించిన సోమన్న"ప్రభూ సాటిమనిషి ఆకలిని మనిషే గుర్తించాలి.మేము బాధను గుర్తించి అనాదరణ పొందినవారిని,వృధ్ధులైన వారిని అందుకునేందుకే సమాజంపట్ల మావంతు బాధ్యతగా సేవాభావంతో ఆశ్రమం నిర్మిచాము"అన్నాడు.
" నిజమే లక్ష్యం లేని జీవితం తెగిన గాలిపటం వంటిది.మనిషి గమ్యం చేరాలి అంటే గమనం తప్పదు.ఆగమనం సమాజ హింగా ఉండాలి. సమాజం పట్ల మీనిర్ణయం అభినందనీయం సాటిమనిషి బాధను మనిషిగుర్తించాలి అన్నమాట నిజం.అందుకు మీరు మార్గదర్శకులు
అయ్యారు.మీ ఆశ్రమానికి అయ్యే కర్చు ఈరోజునుండి మేముభరిస్తాము,ఆశ్రమం మీరు నిర్వహించండి "అన్నాడు రాజుగారు.
రాజుగారికి చేతులు జోడించారు సోమయ్య మిత్రద్వయం.
బాలలు కథవిన్నారుగా మీరు ఈరోజునుండి ఆహారం తీసుకునేసమయంలో ఏదైన ఒక ప్రాణికి మనిషి,పిల్లి,కాకి,పిచుక,కుక్క ఏదైన ఒక ప్రాణికి ఆహారం ఇవ్వడం నేర్చుకొండి.సాటి ప్రాణిని,వ్యాధిగ్రస్తులను,వృధ్ధుల ఎడల కరుణాస్వభావం కలిగిఉండండి'
అన్నాడు తాతయ్య.బుధ్ధిగా తలలుఉపారు బాలలు అందరు.
మార్గదర్శకులు .:-డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.చెన్నయ్ .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి