ఉదయం - బాల గేయం :-ఎం. వి. ఉమాదేవి నెల్లూరు
బంగారు రంగు ఆకాశం 
సింగారమొలికే ఈ ఉదయం 
పూల మొక్కలు తలలూపి 
సీతాకోకకు  విందిచ్చే !

అరుణోదయం అవుతుంది 
సూర్య బింబము లేస్తుంది 
ఎవరి పనుల్లో వాళ్ళుoటే  
శ్రమలకు ఫలితo ఉంటుంది!

పిట్టలు గూడును వీడాయి 
చెట్టుకు భద్రం చెప్పాయి 
పరిసరాలను గమనించు 
ప్రకృతి నష్టం తొలగించు!!


కామెంట్‌లు