" స" గుణింత గేయం:---మచ్చ అనురాధ--తెలుగు భాషోపాధ్యాయురాలుజి.ప.ఉ.పాఠశాల కుకునూర్ పల్లి, కొండపాక మండలం , సిద్దిపేట జిల్లా.

 సరళ విమల చదవండి
సాధన మనము చేద్దాము
సిద్ది బుద్ధిని పొందెదము
సీతాకోకచిలుకల్లాగా
సుభాషితములు నేర్చుకొని
సూక్తులు ఎన్నో తెలుసుకొని
సృష్టిలోన యెదుగుదాము
 "సౄ" ను ఉచ్చరించుదాము
 సెబాసు అని మెచ్చుకునేలా
సేవలు ఎన్నో చేయుదాము
సైనికుల్లాగా రక్షణనిద్దాము
సొంత ఊరికి సేవ చేద్దాము 
సోమరితనము  వీడుదాము
సౌభ్రాతృత్వముతోఉందాము
సంప్రదాయము పంచుదాము.

కామెంట్‌లు