*ప్రేమ!*:-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.

 31.ప్రేమ!
     ప్రేమ లేక బతుకు చీకటి!
     ముగ్గు వేయని వాకిటి!
     ఆరిపోయిన కుంపటి!
     మూగవోయిన కలకంఠి!
32.ప్రేమ!
     అదో తెలియని దారి!
     ఎడారో! ముళ్ళదారో!
      ప్రేమ బాటసారులకదే!
      లక్ష్యసిద్ధికి రహదారి!
33.ప్రేమ!
      ఓ వింత క్రీడ!
      గెలుపు- సమాగమం!
      ఓటమి- నిరీక్షణం!
      హాయే! క్రీడాస్ఫూర్తి!
34.ప్రేమ!
      ప్రేమికుల పరస్పరం!
      "నువ్వే" కావాలి!
      "నువ్వు నాకే " కావాలి!
     " నాకు కావాల్సింది నువ్వే!"
35.ప్రేమ!
      దూరం భౌతికం!
      సామీప్యం మానసికం!
      మనసంతా ప్రేమే!
      బతుకంతా నవ్వే!
           (కొనసాగింపు)

కామెంట్‌లు
Unknown చెప్పారు…
All are good.pramanta.....prama