గురువు:- *డా.గౌరవరాజు సతీష్ కుమార్.*

 త్రిమూర్తిరూపం ఇలనడిచే జ్ఞానసాగరం
నిలువెత్తు విజ్ఞానసర్వస్వం
బతుకువిలువల విన్యాసాలను
విడమరచే జ్ఞాన భాండాగారం
జీవితపాఠాలను నేర్పించే నిండుహృదయం
కదిలేది కదిలించేది నినుదారిలొ నడిపించేది
దారిదీపమై వెలుగొందేది జ్ఞానాంబుధిలో ముంచెత్తేది
కోపంతో కరుణించేది శాపంతో వరమిచ్చేది
మాటలతేనెలు కురిపించేది పరబ్రహ్మమై దీవించేది
తనశిష్యుల కళ్ళల్లో వెలుగుల తళుకులకోసం
తనజీవితాంతం పరిశ్రమించి నిలిచేది
తననోడించే అంతేవాసికోసం పరితపించేది
దేవుడుకోపిస్తే గురువు కాపాడగలడు
గురువుకోపిస్తే ఆ దేవుడేంచేయలేడు
అందుకే గురువాజ్ఞ మీరకు గురుసేవ మానకు!

కామెంట్‌లు