ఎండాకాలం సెలవులు: - మనోజ్ కుమార్- 9 వ తరగతి , జెడ్ . పి . హెచ్ . ఎస్ . నర్మెట , జనగాం జిల్లా

  అందరికీ నమస్కారం...🙏
 నా పేరు మనోజ్ కుమార్. నేను ఎండాకాలం సెలవుల్లో ఎలా గడిపానో చెబుతా.
 ఇంతకు నేను సెలవుల తేదీ చెప్పలేదు కదా 23/4/2026. అప్పుడు ఆరోజు ప్రోగ్రెస్ ఇచ్చారు. ఇంటికి పోయాక మా అమ్మకు చెప్పాను .అమ్మ నేను మార్కులెన్ని తెచ్చుకున్నానో తెలుసా. 600/468 తెచ్చుకున్న అని చెప్పా .మా అమ్మ చాలా సంతోష పడింది. మరుసటి రోజు బయటకు వెళ్లాను .అప్పుడు నాకు మా గల్లీ పోరగాళ్లు కనిపించారు. వాళ్ళు గోటీలు బొంగరం పైసలు ఆట ఆడుతున్నారు . నేను కూడా గోటీలు తెచ్చుకొని ఆడుతున్న సమయంలో మా తమ్ములు వచ్చారు. ఏంట్రా మీరు ఇక్కడికి వచ్చారు అనగానే నేను కూడా ఆడతాను అన్నాడు  మా తమ్ముడు సరేలే అని ఆడిపించాను. మా తమ్ముళ్ళ గోటీలు అన్నీ పోయాయి. అన్న నాకు కొన్ని గొటీలు ఇయవా అని అడిగాడు. ఆట తర్వాత ఇస్తా అని నేను అన్నాను. మరుసటి రోజు తెల్లవారి జామున హైదరాబాదుకు మా బాబాయ్ తో కలిసి వెళ్ళాము. ఆడ ఒక పది రోజులు ఉన్న తర్వాత మా ఊరికి వచ్చినంక మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. తర్వాత మల్ల కొన్ని రోజుల తర్వాత హైదరాబాదుకు వెళ్ళాము. అక్కడికి పోయాక స్నానం చేసి కొంత సేపు పడుకొని తర్వాత లేచే వరకు 4:30 అయింది .అన్నం తిని కారులో ట్యాంక్ బండ్ చార్మినార్ ఇట్లా గోల్కొండ తిరిగాము .వెళ్తూ వెళ్తూ ఒక దగ్గర హనుమాన్ గుడి ఉన్నది .గుడిలోకి వెళ్లి దేవుని దర్శనం చేసుకొని మళ్లీ దారిలో ప్రసాదం తీసుకొని తిని మాట్లాడుకుంటూ ప్రయాణం కొనసాగించాం. నాకు పెద్దపెద్ద భవనాలు, అంబేద్కర్ బొమ్మలు ఇంకా ఇట్లా చానా కనపడ్డాయి .ఒక రౌండు ట్యాంక్ బాండ్ చుట్టూ తిరిగాము. తర్వాత  డ్రెస్సులు షార్ట్స్ ఫేస్ వాష్ ఇట్లా కొనుక్కున్నాము. ఐస్ క్రీమ్ తిని వెళ్తున్నాము. తర్వాత ఇంటికి చేరుకున్నాం. మల్ల మరసటి రోజున ఒక బండి హైదరాబాద్ నుంచి రిపేర్ కి వచ్చింది .ఆ షాప్ లో నేనొక్కన్నే ఉన్నా. మా బాబాయ్ కి ఫోన్ చేసి రమ్మన్న రిపేర్ వచ్చింది కదా అని చెప్పా . వచ్చి అది బండి అంతా విప్పి క్లీన్ చేశాడు. 12:10 అయింది .ఇట్లా కొన్ని రోజుల తర్వాత మా చిన్న బాబాయ్ తోని వెళ్ళాము. ఎక్కడికి వెళ్ళాము అంటే ఈత కొట్టడానికి వెళ్ళాము. కొంచెం అట్లా సరదాగా ఈత కొట్టి ,ఈత పండ్లు తిని ఇంటికి పోయాము. తరువాత డాడీ దారా అని పిలిచాడు. మామిడికాయలకు పోదాం అన్నాడు .సరే డాడీ అని అన్నాను. అక్కడికి పోయాక మామిడికాయలు నింపి ఇంటికి తీసుకుకవెళుతుంటే దారిలో అల్లనేరేడుపళ్లు, నక్కరిక పండ్లు తీసుకుని ఇంటికి వచ్చాము .కొన్ని పండ్లు తిని కొన్ని పండ్లు మా బాబాయ్ కి ఇచ్చాము. తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఇంటి ముందట ఒక పిల్లగాడు ఉండేవాడు.వాడు వచ్చి లూడో ఆడదామా అన్న అని పిలిచాడు. ఆడదామన్నాడు బెట్టు పెట్టి ఆడుదాం అన్నాడు .బెట్టు పెట్టి ఆడితే వాడివి యాభై రూపాయలు పోయినవి.వాళ్ళ అమ్మ వచ్చి కోప్పడ్డది.అప్పుడు ఆ తమ్మున్ని చూస్తే బాధ కలిగింది.అప్పుడు అనుకున్నా ఇంకెప్పుడు బెట్ పెట్టి ఆడవద్ధని.
ఆ తరువాత నుండి బెట్ పెట్టి ఆడవద్ధని చెప్పాను.అది విన్నాడు. తర్వాత సరదాగా ఆడాము .ఇట్లా రోజు నవ్వులతో సంతోషంతో ఎండాకాలపు సెలవులు అయిపోయాయి.. ధన్యవాదాలు..
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
Very good..continue it..
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం