మా అమ్మ*(బాలగేయం): - డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 తెల్లవారగానె నిద్రలేపుతుంది 
మా అమ్మ
పళ్ళుముఖము బాగ కడుగుతుంది
మా అమ్మ
చక్కగా స్నానం చేయిస్తుంది
మా అమ్మ
ఉతికిన బట్టలు తొడిగిస్తుంది
మా అమ్మ
గుజ్జు బువ్వ నాకోసం వండుతుంది
మా అమ్మ
గోరు బువ్వ నాకు కలిపిఇస్తుంది
మా అమ్మ
కొసరి కొసరి పాలబువ్వ తినిపిస్తుంది
మా అమ్మ
చకచక బడికి నన్ను పంపుతుంది
మా అమ్మ
సాయంత్రం ఆటలెన్నొ ఆడిస్తుంది
మా అమ్మ
తరువాత పాటలెన్నొ పాడిస్తుంది
మా అమ్మ
కమ్మనైన బువ్వ నాకు తినిపిస్తుంది
మా అమ్మ
కథలెన్నొ చెప్పి నన్ను జోకొడుతుంది
మా అమ్మ!!!

కామెంట్‌లు